Cracked Heels : పాదాల పగుళ్లకు అద్భుతమైన చిట్కా ఏంటో తెలుసా?

ఒక టీ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. అందులో ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి పేస్టులా చేసుకోవాలి. పగుళ్లు ఎక్కువగా ఉంటే టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. పాదాలను పది నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచాలి.

  • Written By: Srinivas
  • Published On:
Cracked Heels : పాదాల పగుళ్లకు అద్భుతమైన చిట్కా ఏంటో తెలుసా?

Cracked Heels : చలికాలంలో మన కాళ్లు పగులుతుంటాయి. పగుళ్లు ఏర్పడిన కాళ్లతో మనం బయటకు వెళ్లాలంటే భయపడతాం. కాళ్ల పగుళ్లు ఉంటే మనకు ఇబ్బందులొస్తాయి. నడిచేటప్పుడు నొప్పులు వస్తాయి. పాదాల పగుళ్లకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య ఇంకా పెరిగే అవకాశాలుంటాయి. దీంతో ఎన్నో చిట్కాలు పాదాల పగుళ్ల కోసం ఉన్నాయి. వాటిని పాటించి పగుళ్లు పోగొట్టుకోవాలి.

డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి పాదాల పగుళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే కాళ్లకు ముప్పు వస్తుంది. పాదాల పగుళ్లను తగ్గించడానికి బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాదాల పగుళ్లకు చక్కని పరిష్కారం లభిస్తుంది. దీంతో మనం పాదాల పగుళ్లకు సరైన చిట్కా పాటించడంతో ఫలితం ఉంటుంది.

ఒక టీ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. అందులో ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి పేస్టులా చేసుకోవాలి. పగుళ్లు ఎక్కువగా ఉంటే టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. పాదాలను పది నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచాలి. తరువాత పాదాలకు బియ్యం పిండి పేస్టును రుద్దాలి. పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మూడు రోజుల పాటు ఇలా చేస్తే పాదాల పగుళ్లు మాయం అవుతాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే తగ్గేవరకు దీన్ని వాడాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు పోవడం ఖాయం. ఈ చిట్కా పాటించి మన పాదాల పగుళ్లను దూరం చేసుకోవచ్చు. సులభంగా పాటించే పరిహారం కావడంతో అందరు ఇంట్లోనే పాటించుకోవచ్చు.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు