J.J. Abrams- RRR: రాజమౌళి కాంపౌండ్ నుంచి వచ్చిన మల్టీ మెగా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్ తో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించింది. కమర్షియల్ గానూ అంచనాలను బీట్ చేసిన ట్రిపుల్ ఆర్ ను ఇటీవలే జపనీస్ భాషలో అక్కడ రిలీజ్ చేశారు. అక్కడా ఆర్ఆర్ఆర్ కు తగ్గేదేలే.. అన్నట్లుగా వసూళ్లు తెచ్చిపెట్టాయి. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో డైరెక్టర్ రాజమౌళి ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజమౌళిని వెస్టర్న్ టాప్ డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన టేకింగ్ పై పలు విధాలుగా ప్రశంసించారు.

J.J. Abrams- rajamouli
హాలీవుడ్లో మిషన్ ఇంపాజిబుల్ III గురించి తెలియంది కాదు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మంచి టాక్ తెచ్చింది. ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన JJ అబ్రమ్స్ ఆ తరువాత స్టార్ వార్స్: ‘ది ఫోర్స్ అవేకెన్స్… స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కై వాకర్… అనే రెండు చిత్రాలను తీశారు. ఈ సినిమాలతో అబ్రమ్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అలాంటి డైరెక్టర్ మన తెలుగు దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
ఇటీవల యూఎస్ లో ఆర్ఆర్ఆర్ ను ప్రదర్శించారు. ఈ మూవీకి హాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ వచ్చారు. ఇందులో భాగంగా స్టార్ వార్స్ డైరెక్టర్ JJ అబ్రమ్స్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాలీవుడ్ సెలబ్రెటీల జాబితాలో రాజమౌళి చేరారని అన్నారు. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలిస్తే కనీసం ఒక అవార్డునైనా గెలుస్తుందనే నమ్మకం ఉండేదన్నారు. ఈయనతో పాటు పలువురు హాలీవుడ్ డైరెక్టర్లు రాజమౌళి పనితీరుపై ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

rajamouli, J.J. Abrams
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మూవీ స్వాతంత్ర్య నేపథ్యంలో సాగుతోంది. పాన్ ఇండియా లెవల్లో సినిమాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే అస్కార్ బరిలో ట్రిపుల్ ఆర్ నిలుస్తుందని అందరూ ఆశించారు. కానీ చివరి నిమిషంలో గుజరాత్ మూవీ నామినేట్ కావడంపై జక్కన్న అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ లెవల్లో ఆర్ఆర్ఆర్ కు ప్రశంసలు దక్కడంపై ఖుషీ అవుతున్నారు.