Nandamuri Balakrishna: పిక్ ఆఫ్ ది డే : బాలయ్య మారిపోయాడు.. ఒదిగిపోయాడు
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం అనగానే అందరికీ గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ. నటనలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలయ్య ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడి అనిపించుకుంటున్నారు. తనకంటూ సొంత ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. నటనలో బాలయ్యకు ఆయనే పోటీ అన్నంతగా నటిస్తున్నారు. మాస్, యాక్షన్ మూవీలతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే రాజకీయంగా మాత్రం తండ్రి వారసత్వం రాలేదనే చెప్పాలి. సినిమాల్లో పెద్దపెద్ద డైలాగ్స్ చెప్పే బాలయ్య బయట మీటింగ్‌ల్లో మాత్రం మాట తడబడుతూ మాట్లాడతాడు. కారణం తెలియదు […]


Nandamuri Balakrishna
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం అనగానే అందరికీ గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ. నటనలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలయ్య ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడి అనిపించుకుంటున్నారు. తనకంటూ సొంత ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. నటనలో బాలయ్యకు ఆయనే పోటీ అన్నంతగా నటిస్తున్నారు. మాస్, యాక్షన్ మూవీలతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే రాజకీయంగా మాత్రం తండ్రి వారసత్వం రాలేదనే చెప్పాలి. సినిమాల్లో పెద్దపెద్ద డైలాగ్స్ చెప్పే బాలయ్య బయట మీటింగ్‌ల్లో మాత్రం మాట తడబడుతూ మాట్లాడతాడు. కారణం తెలియదు కానీ అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం బాలయ్యకు లేదనే చెప్పాలి. రాజకీయ సభల్లో, ఎన్నికల ప్రచారాల్లోనూ బాలయ్య ప్రసగం పెద్దగా ఆకట్టుకోరు. అయితే బాలయ్య ఏ వేషం వేసినా సినిమాలో ఒదిగి పోతాడు. తాజాగా ఆయన తన హిందూపురం నియోజకవర్గంలో ముస్లింలకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అందులో బాలయ్య కూడా ముస్లిం వస్త్రధారణలో ఒదిగిపోయారు.
అందరిలో కలిసిపోయిన బాలయ్య..
ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం హిందూపురం నియోజకవర్గంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అలిహిలాల పాఠశాల క్రీడా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. అనంతరం తానే స్వయంగా భోజనం వడ్డించారు. వారితో పాటే సహ పంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసిసోయేలా బాలయ్య వస్త్రధారణ ఉంది. అందరిలో కలిసిసోయినట్లుగా బాలయ్య కనిపించారు.
సామాజిక కార్యక్రమాల్లో ముందు..
సినిమాల్లో ఎంత హీరోయిజం చూపుతారో బయట సామాజిక కార్యక్రమాల్లోనూ బాలయ్య అంతే ముందుంటారు. చిన్నారులకు ఆరోగ్యం విషయంలో, పేదలకు దానం చేయడంలో, వేడుకల్లో అందరిలో కలిపిసోవడంతో బాలయ్య ప్రత్యేకం. పైకి గంభీరంగా కనిపించే బాలయ్య హృదయం మాత్రం మెత్తన అని చాలామంది అంటారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు ఆయన అనేక విధాలుగా ఆదుకుంటారు. పేద కుటుంబాలకు చెందిన కళాకారులకు అనేకరకాలుగా సాయం చేస్తారు. వారి పిల్లల చదువుకు ఆర్థికంగా సాయం అందిస్తారు. తాను సినిమాల్లోనే కాదు.. బయట కుడా నిజమైన హీరోను అనిపించుకుంటారు.

Nandamuri Balakrishna
అప్పుడప్పుడు వివాదాలు..
అయితే అప్పుడప్పుడు మాత్రం బాలయ్య వివదాల్లో చిక్కుకుంటారు. సినిమా ఇండస్ల్రీతోని నటులు, వారి కుటుంబ సభ్యలపైనే నోరు పారేసుకుంటారు. అభిమానులపై చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే బాలయ్య మెత్తని మనసు వెనుక, ఉగ్ర నరసింహుడు కూడా ఉన్నాడు. ఆయనకు కోపం వస్తే లోపల ఉన్న నరసింహుడు బయటకు వస్తాడు. కోపం తెప్పించే పనులు చేస్తే బాలయ్య కూడా అంతే కోసంగా సమాధానం చెప్పారు.
