మాసిపోతున్న హిమాలయాలు!
ప్రపంచంలో దాదాపుగా ఎక్కడాలేని సమతోశీతష్ణ స్థితి భారతదేశంలో ఉంది. దీనికి ప్రధాన కారణంగా హిమాలయాలే అన్న సంగతి తెలిసిందే. ఎన్నో జీవనధులకు జీవధారను అందిస్తున్న హిమలాయాలకు ప్రమాదం పొంచి ఉందని ఎంతో కాలంగా శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా.. హిమాలయాల్లోని మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయని దశాబ్దాల కిందటి నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా.. మరో విషయమై హెచ్చరించింది వరల్డ్ బ్యాంక్. అత్యంత తెల్లగా ప్రకాశించే మంచు కొండలు.. మానవ చర్యల […]

ప్రపంచంలో దాదాపుగా ఎక్కడాలేని సమతోశీతష్ణ స్థితి భారతదేశంలో ఉంది. దీనికి ప్రధాన కారణంగా హిమాలయాలే అన్న సంగతి తెలిసిందే. ఎన్నో జీవనధులకు జీవధారను అందిస్తున్న హిమలాయాలకు ప్రమాదం పొంచి ఉందని ఎంతో కాలంగా శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా.. హిమాలయాల్లోని మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయని దశాబ్దాల కిందటి నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా.. మరో విషయమై హెచ్చరించింది వరల్డ్ బ్యాంక్.
అత్యంత తెల్లగా ప్రకాశించే మంచు కొండలు.. మానవ చర్యల వల్ల మసిబారుతున్నాయని వెల్లడించింది. మసి రేణువులు మంచు కొండలను కప్పేస్తుండడంతో.. హిమాలయాలు సహజత్వాన్ని కోల్పోతున్నాయని తెలిపింది. ఈ మేరకు ఓ రీసెర్చ్ రిపోర్టును కూడా వెల్లడించింది.
అధిక ఉష్ణోగ్రతలకు తోడు మసి రేణువులు మంచుపర్వాతలపై పేరుకు పోతుండడం వల్ల మంచు వేగంగా కరిగిపోతోందని తెలిపింది ప్రపంచ బ్యాంక్ రిపోర్టు. దక్షిణాసియా లోపల, బయట జరుగుతున్న మానవ కార్యకలాపాల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పింది. ఈ పరిస్థితి మరింత ముదిరితే చాలా ఇబ్బందులు వస్తాయని హెచ్చరించింది.
ఇప్పటికే వరదలు పోటెత్తడం.. మంచు పర్వతాలు విరిగి పడడం కూడా ఇందులో భాగమేనని తెలిపింది. హిమానీ నదాలు వేగంగా తరిగిపోవడం వల్ల దూర ప్రాంతాల్లో నివసించే వారికి నీటి కొరత ఏర్పడుతుందని హెచ్చరించింది. దీనివల్ల వారి జీవితాలపై పెను ప్రభావం చూపుతుందని కూడా తెలిపింది.
అయితే.. మసి రేణువుల విడుదలను తగ్గించడం ద్వారా.. ఈ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా జల విద్యుత్ పై దృష్టి సారించాల్సి ఉందని తెలిపింది. ఈ విద్యుత్ ఉత్పత్తి వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టమూ లేదని, కాలుష్యం కూడా ఉత్పత్తి కానందున.. దక్షిణాసియా దేశాలు ఆ వైపు దృష్టి సారించాలని సూచించింది. హిమాలయాల పరిరక్షణ విషయంలో ప్రబుత్వాలు, పరిశోధకులు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించింది.
