KCR- TS High Court: రాజకీయమంటే గిట్టని వాడిని కొట్టడమే.. అంటే ఈ కొట్టడంలో కూడా ప్రత్యక్ష, పరోక్ష విధానాలు ఉంటాయి.. అయితే వీటిలో మనం ప్రదర్శించిన నేర్పు తోనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.. ఇలాంటి వాటిల్లో నేర్పరితనం ప్రదర్శించినవారు రాజకీయాల్లో రాణించారు.. అది లేనివారు కాలగర్భంలో కలిసిపోయారు. ఇక ఈ సువిశాల భారతదేశంలో ఒక్కో రాజకీయ నాయకుడిది ఒక్కో స్టైల్.. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది పూర్తి డిఫరెంట్ స్టైల్.. ఎవడు ఏమనుకున్నా సరే తన దారిలో తాను వెళుతూ ఉంటాడు.. ఎవరిని పెద్దగా లెక్కచేయడు.. ఇప్పుడు ఆయన బంగారు తెలంగాణ మోడల్ అయిపోయింది… ఇప్పుడు బంగారు భారత్ మీద పడ్డాడు.. అంతేకాదు ఢిల్లీలో చక్రాలు తిప్పాలని రథాన్ని సిద్ధం చేస్తున్నాడు.. మోడీని గద్దె దించేందుకు ఢిల్లీకి దారులు పరుస్తున్నాడు.. అయితే ఈ ప్రక్రియలో అతని రాజకీయ ధోరణి ఏవగింపు కలిగిస్తోంది.. ప్రతి దాన్ని పొలిటికల్ యాంగిల్ లో చూడటం మరీ అతి అయిపోయింది. ఇప్పటి వాట్సాప్ భాషలో చెప్పాలంటే మరీ టూ మచ్ అయిపోయింది.

KCR- TS High Court
నేనే, నా వల్లే, నేను మాత్రమే, నేనొక్కన్నే అనే ఫీలింగ్స్ కొందరిలో కాలిగోటి నుంచి నడి నెత్తిలో వెంట్రుక వరకు వ్యాపించి ఉంటాయి.. వాటిని ఉత్ప్రే రకాలు అంటారు.. అవే వారిని ముందుకు తోస్తూ ఉంటాయి.. ఈ జాబితాలో కెసిఆర్ ఉంటాడు.. అతను ఎప్పుడూ రాజకీయ నాయకుడే తప్ప.. రాజ నీతిజ్ఞుడిగా లేడు. అంతా బభ్రజమానం భజగోవిందం..
ఇక్కడి వరకు కాస్త పర్లేదు.. కానీ ఎప్పుడైతే ఆత్మాభిమానం, పాజిటివ్ ఫోర్స్ దాటి ఇంకాస్త పైకి వెళ్తే.. లేదా ఒక గీత దాటితే ఆ వైఖరిని, ఆ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆరే దీనికి సమాధానం చెప్పాలి.. ఎందుకయ్యా దీని గురించి ఈ చర్చ అంటే.. ఈ గణతంత్ర భారతంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు జరపాలని చివరకు హైకోర్టు చెప్పాల్సిన దుర్గతి.. పోనీ దురవస్థ. దీనిని బయటకి ఎవరు ఎంత చెప్పుకున్నా, ఆ సో కాల్డ్ నమస్తే తెలంగాణ, టీ న్యూస్ సమర్ధించుకున్నా.. ఇది పూర్తి విఫల ప్రయత్నం.. ఈ దేశంలో పాలన నడిచేదే రాజ్యాంగాన్ని అనుసరించి.. అది అమల్లోకి వచ్చింది గణతంత్ర దినోత్సవం నాడు.. ఇన్ని సంవత్సరాలుగా ఆ ఉత్సవాల్ని జరుపుకుంటూనే ఉన్నాం.. కానీ ఈ దేశంలో భాగమైన తెలంగాణ మాత్రం అది జరపదట? ఇందుకు చెబుతున్న కారణం కరోనా… ఖమ్మంలో సభ జరిపితే, ఫిబ్రవరి 17న సభ నిర్వహించేందుకు తలపోస్తే… అక్కడ కోవిడ్ జాడలు ఉండవు.. కరోనా భయాలు ఉండవు.. ప్రజల నిత్య జీవన వ్యవహారాల్లో లేని కరోనా భయం.. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఎందుకు అడ్డుపడుతుందో కెసిఆరే చెప్పాలి.

KCR- TS High Court
అది ఒక పిచ్చి సాకు అని అందరికీ తెలుసు.. గవర్నర్ మీద కోపంతో, ఆమె మీద కొనసాగుతున్న కక్ష సాధింపు ఆలోచనలతో పుట్టుక వచ్చిన దురాలోచన తంత్రమే ఈ గణతంత్ర నిర్లిప్తత. అసలు గవర్నర్ పట్ల కెసిఆర్ పార్టీ, ప్రభుత్వ వైఖరి హుందాగా లేదు.. ఆమెను అమితంగా గౌరవించాలని, ఆమె నిర్ణయాలను వ్యతిరేకించకూడదని ఎవరూ చెప్పడం లేదు.. రాజ్యాంగ వ్యవస్థల మధ్య గౌరవ మర్యాదలు, ఆనవాయితీలు, సంప్రదాయాలు కొనసాగాలి. ఏవో దృష్టిలో పెట్టుకొని ఏకంగా ఈ దేశ రాజ్యాంగం పట్ల, పతాక వందనం పట్ల అగౌరవం చూపడం ఏమిటి? ఆ రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ ఏర్పడిందని విస్మరిస్తే ఎలా.. ఎస్… హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది… గణతంత్ర వేడుకలు నిర్వహించాలని.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.. పరేడ్ కూడా నిర్వహించాలని స్పష్టంగా చెప్పింది.. దీనికి హైకోర్టుతో చెప్పించుకోవాలా? ఇదేనా కెసిఆర్ దేశానికి అందిస్తానంటున్న గుణాత్మకమైన మార్పు? ఈ మార్పు కోసమేనా దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సింది? ఇప్పుడు ఎవరి పరువు పోయినట్టు? ఎవరు తల దించుకున్నట్టు? అందుకే కొన్ని కీలక అంశాలో నైనా కాస్త రాజనీతిజ్ఞత ప్రదర్శించాలని అందుకే చెప్పేది.. కొత్త సచివాలయం ప్రారంభానికి వేరే ముఖ్యమంత్రులని పిలిచి ఘనంగా చేయడం రాజకీయం.. దానికి గవర్నర్ ను పిలుస్తాడా? లేదా? అనేది మళ్లీ ఇప్పుడు చర్చనీయాంశం.. ఎందుకంటే టెక్నికల్ గా గవర్నర్ దే ఈ ప్రభుత్వం కాబట్టి… ఈ మాత్రం సోయి కూడా లేని కేసీఆర్ కు హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది కాబట్టి..