High Court Notices To KCR: వడ్డించేవాడు మనవాడైతే చివరి ఫంక్తిలో కూర్చున్నా ఫర్వాలేదు. అధికారం మన చేతుల్లో ఏదైనా చేయొచ్చని కేసీఆర్ ఎన్నోసార్లు చూపించారు. ప్రస్తుతం అదే కోవలో పార్టీ కోసం స్థలం కావాలని ఏకంగా ప్రధాన కేంద్రమైన బంజారాహిల్స్ లోనే భూమి కేటాయించుకోవడంపై హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రభుత్వం ఉన్నంత మాత్రాన అప్పనంగా భూమి ఎలా సొంతం చేసుకుంటారని ప్రశ్ణించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత నేతలను, అధికారులకు సూచించింది. దీంతో సర్కారు నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది.

High Court Notices To KCR
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో 4935 గజాల స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీకి కేటాయించడం పై విమర్శలు వస్తున్నాయి. గజం భూమి రూ.100 చొప్పున లెక్క గట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు విచారణ చేపట్టి సర్కారు తీరును గర్హించింది. చేతిలో అధికారం ఉందని భూమిని ఇంత తక్కువ ధరకు దక్కించుకోవడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. సర్కారు తీరు విమర్శలకు కేంద్రంగా మారుతోంది.
Also Read: Janhvi kapoor- NTR: ఎన్టీఆర్ సినిమాతోనే శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ
సీఎం కేసీఆర్, సీఎస్, సీసీఎల్ఏ, రెవెన్యూ సీఎస్, హైదరాబాద్ కలెక్టర్ లకు నోటీసులు పంపింది. ప్రభుత్వ భూమిని తమ ఇష్టానుసారం పార్టీ సొంతం చేసుకుని అక్రమాలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టు అభ్యంతరంతో వెలుగులోకి రావడంతో నేతల్లో ఆందోళన మొదలైంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ భూములను ఇలా అప్పనంగా దొబ్బేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు తెలస్తోంది.
Also Read: Enemies Of Tollywood: అరుదైన ఘట్టం ఒక్క చోట చేరిన బద్దశత్రువు… ఇలా కలుస్తారని అసలు ఊహించలేదు.