High Court green signal..’Kantara’ fans are happy : చిన్న సినిమాగా విడుదలై థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘కాంతారా’..ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 కోట్ల రూపాయిల గ్రాస్ ,230 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించిన ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది..అయితే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన OTT వెర్షన్ ని చూసి అభిమానులు బాగా హర్ట్ అయ్యారు..ఎందుకంటే ఈ సినిమా అంత పెద్ద సంచలన విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన ‘వరాహ రూపం’ అనే సాంగ్ ని తీసి వెయ్యడమే.
దానికి కారణం కేరళ ప్రాంతానికి చెందిన ‘తైక్కుడం బ్రిడ్జి’ ఆల్బం వారు చేసిన పాట ని కాపీ కొట్టారంటూ హై కోర్ట్ లో కేసు వేశారు..దీనితో ఈ కేసు న్యాయ విచారణ జరిపి తుది తీర్పు వచ్చేంత వరుకు సినిమా నుండి ఆ పాటని తొలగించాలని హై కోర్టు ఆర్డర్ ఇవ్వడం తో, మూవీ యూనిట్ థియేటర్స్ లో ఈ సినిమా నడుస్తున్న సమయం లోనే ఆ పాటని తీసి వేశారు.
దీనితో ఈ సినిమాని థియేటర్ లో చూసే రిపీట్ ఆడియన్స్ బాగా హర్ట్ అయ్యారు..రోమాలు నిక్కపొడుచుకునేలా చేసే ఆ అద్భుతమైన పాటని తొలగించడం వల్ల సినిమాలో ఉన్న గొప్ప ఫీల్ పోయిందని ఫ్యాన్స్ ఆరోపించారు..పోనీ డిజిటల్ వెర్షన్ మూవీ రిలీజ్ లో అయినా ఆ పాట ఉంటుందని ఊహించిన అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురైంది..అలా నిరాశకి గురైన ఫాన్స్ కి ఇప్పుడు ఒక శుభ వార్త.
కొద్దీ కాలం నుండి హై కోర్ట్ నడుస్తున్న ఈ కేసు ని విచారించిన తర్వాత కోజికోడ్ కోర్టు కేసు ని కొట్టి పారేసింది..ఇక పాలక్కాడ్ కి సంబంధించిన కోర్టు నుండి తీర్పు రావాల్సి ఉంది..అక్కడ ఇలాగె పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఇక ఈ పాట ని OTT లో కూడా యాడ్ చేస్తారని తెలుస్తుంది..ఈ పాట కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ అందరికి ఇది పండగ లాంటి వార్త అనే చెప్పాలి.