Hyderabad: ‘యాపిల్ పండ్లు ఉన్నాయా.. రేటేంత..? చెర్రి పండ్లున్నాయా.. వాటి ధర ఎంత..?’ అని కొందరి వాట్సాప్ చాటింగ్లో కనిపించాయి. అదేంటి యాపిల్ పండులు, చెర్రీ పండ్లు కావాలంటే మార్కెట్లోకి వెళ్లి అడగాలి కదా..? వాట్సాప్లో ఎందుకు..? అనే డౌట్స్ రావచ్చు. అయితే ఇక్కడ యాపిల్ పండ్లు అంటే ఇండియాకు చెందిన అమ్మాయిలు.. చెర్రీ పండ్లు అంటే ఆస్ట్రేలియాకు చెందిన అమ్మాయి.. ఇక వీటి ధరను అడుగుతున్నారంటే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇలా వాట్సాప్ వేదికగా సైబర్ క్రైమ్ పోలీసులకు దొరకకుండా కొందరు గుట్టుచప్పుడుగా వ్యభిచారం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ దేశం అమ్మాయికి ఒక కోడ్ ను పెట్టి అలాంటి కోడ్ లతో అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారు.
అయితే వీరి వ్యాపారం ఎంతోకాలం సాగలేదు. హైదరాబాద్ పోలీసులు పసిగట్టి పట్టుకున్నారు. తమకు వచ్చిన సమాచారం ఆధారంగా నగరంలోని గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ పై పోలీసులు దాడి చేశారు. దీంతో ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వీరిని విచారించిన తరువాత షాకింగ్ విషయాలను వారు బయటపెట్టారు. ఆన్లైన్లో అమ్మాయిల వివరాలను పెట్టి కొందరికి ప్రచారం చేస్తున్నారు. ఇలా కొందరు అమ్మాయిల కావాలనుకునే వారికి ప్రతీ అమ్మాయికి ఓ రేటు ఫిక్స్ చేసి భారీ ఎత్తున దందా నిర్వహిస్తున్నారు.
కజకిస్థాన్, థాయ్ లాండ్, ఉజ్బెకిస్థాన్ నుంచి కొందరు యువతులు భారత్ కు విజిట్ వీసాపై వస్తున్నారు. ఆ వీసా గడువు ముగిసే వరకు ఇక్కడే పలు ప్రాంతాల్లో తమ కార్యాకాలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే వీరితో ఓ గ్రూపు ఏర్పాటు చేసి ఇందులో ప్రధానంగా ఓ వ్యక్తి ఈ తతంగమంతా నడిపిస్తాడు. విదేశీ యువతులను బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు లాంటి నగరాలకు తిప్పుతూ అవసరమైన వారి దగ్గరికి చేరవేరేస్తున్నారు. అయితే పోలీసులు వీరిని గుర్తు పట్టకుండా కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డును తయారు చేసుకొని తాము స్వదేశీ యువతులమన్నట్లుగా చూపిస్తున్నారు.
ఇక వీసా గడువులోపే వీరితో వ్యాపారం నిర్వహించి, ఆ తరువాత వీసా గడువు పూర్తికాగానే తమ దేశానికి వెళ్తున్నారు. అయితే ఈ సమయంలోనే వీరితో కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖేశ్ అనే వ్యక్తి మొబైల్ లో ఈ దందాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈయన మొబైల్ లో పలువురి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. పోలీసులు మరింత లోతుగా పరిశీలించి ఇంకా ఎవరెవరు ఉన్నారు..? అనే విషయంపై విచారణ జరుపుతున్నారు.
ఇక ప్రముఖులతో వ్యభిచార ఢీలింగ్స్ మాట్లాడుకొని పెద్ద పెద్ద హోటళ్లలో ఈ వ్యవహారాన్ని నడిపిస్తారు. ఇందులో ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటారు. ఎక్కువ రోజులు ఉంటే అనుమానం వస్తుందనే ఉద్దేశ్యంతో కొన్ని రోజులు మాత్రమే ఉంటారు. ఆ తరువాత మరో నగరానికి పయనమవుతారు. అలా వీసా గడువు పూర్తయ్యే వరకు దేశం మొత్తం చక్కర్లు కొడుతూనే ఉంటారు. అయితే కొందరు అమ్మాయిలు ఇతర కారణాలు చెప్పి ఇక్కడికి ఇలాంటి కార్యాకాలాపాల్లో పాల్గొంటున్నారు. అయితే కొందరు అమాయకులు తమకు తెలియకుండా చిక్కుకుంటే.. కొందరు మాత్రం తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాదన కోసం ఒప్పేసుకుంటున్నారు.
కానీ హైదారాబాద్ పోలీసులు మాత్రం వీరి బండారాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా అమ్మాయిలకు పండ్ల పేర్లు పెట్టి కోడ్ ఇవ్వడంపై షాక్ తిన్నారు. ఆ తరవాత సీరియస్ గా విచారణ చేపట్టి వారి నుంచి అసలు నిందితులను పట్టుకుంటామంటున్నారు.