Heroine Sadha: అందుకే పెళ్లి చేసుకోలేదు, ఇకపై చేసుకోను..!
సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఏ మాత్రం విరామం దొరికినా అరణ్యాలకు చెక్కేస్తోంది. పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను తన కెమెరాలో బంధిస్తూ ఉంటుంది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత అహింస మూవీలో సదా నటించారు. దర్శకుడు తేజా తెరకెక్కించిన అహింస చిత్రంలో సదా కీలక రోల్ చేసింది. బుల్లితెరపై సందడి చేస్తుంది. డాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Heroine Sadha: హీరోయిన్ సదా ప్రస్తుత వయసు 39. అయినా పెళ్లి మాటెత్తడం లేదు. దీంతో మీడియా ఆమె మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సదా షాకింగ్ కామెంట్స్ చేసింది. సదా మాట్లాడుతూ… పెళ్లి చేసుకోలేదు కాబట్టే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. అందులోనూ నాకు వైల్డ్ లైఫ్ అంటే ఇష్టం. జంతువులను ప్రేమిస్తున్నాను. పెళ్ళయితే నా అభిరుచికి తగ్గట్లు నడుచుకోవడానికి కుదరదు.
పెళ్ళైతే అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోకుండా షరతులు పెట్టేవాళ్ళు ఉంటారు. అందులోనూ ఈ జనరేషన్ లో పెళ్లిళ్లు అసలు నిలబడటం లేదు. అందరూ విడిపోతున్నారు. కాబట్టి పెళ్లి చేసుకోకపోవడే మంచిది కదా… అన్నారు. సదా మాటలు పరిశీలిస్తే ఆమెకు ఇకపై పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలుస్తుంది. ఇప్పటికే శోభన, టబు, నగ్మా, అనుష్క ఈ లిస్ట్ లో ఉన్నారు. కొత్తగా సదా చేరినట్లు అయ్యింది.
సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఏ మాత్రం విరామం దొరికినా అరణ్యాలకు చెక్కేస్తోంది. పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను తన కెమెరాలో బంధిస్తూ ఉంటుంది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత అహింస మూవీలో సదా నటించారు. దర్శకుడు తేజా తెరకెక్కించిన అహింస చిత్రంలో సదా కీలక రోల్ చేసింది. బుల్లితెరపై సందడి చేస్తుంది. డాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
2002లో తేజా తెరకెక్కించిన జయం మూవీతో సదా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. జయం బ్లాక్ బస్టర్ కావడంతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్ పక్కన నటించారు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. ఆ మూవీ అనంతరం సదాకు బ్రేక్ రాలేదు. సదా స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడింది. వరుస పరాజయాలతో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.