Heroine Sadha: అతనికంటే పశువులు ఎంతో బెటర్..అందుకే పెళ్లి చేసుకోలేదు : హీరోయిన్ సదా
ఇప్పటికీ ఈమె సదా ని ఎవరైనా ఇమిటేట్ చెయ్యాల్సి వస్తే, ఈ డైలాగ్ తోనే ఇమిటేట్ చేస్తారు. అంత పాపులర్ అయ్యింది అన్నమాట. ఈ సినిమా తర్వాత ఆమె చేతికి ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చెయ్యకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సెపెరేట్ ఇమేజి ని ఏర్పర్చుకుంది. రీసెంట్ గానే ఆమె తేజ దర్శకత్వం లో తెరకెక్కిన ‘అహింస’ అనే చిత్రం లో నటించింది.

Heroine Sadha: ఒక హీరోయిన్ కి మొదటి సినిమాతోనే గుర్తింపు రావడం అనేది చాలా అరుదు.అలా గుర్తింపుని దక్కించుకున్న వాళ్ళని అదృష్టవంతులుగా భావించొచ్చు, అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ‘సదా’. నితిన్ మరియు తేజ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘జయం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన ఈమె తొలిసినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘వెళ్ళవయ్యా బాబు..వెళ్ళు’ అంటూ అప్పట్లో ఈమె చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఇప్పటికీ ఈమె సదా ని ఎవరైనా ఇమిటేట్ చెయ్యాల్సి వస్తే, ఈ డైలాగ్ తోనే ఇమిటేట్ చేస్తారు. అంత పాపులర్ అయ్యింది అన్నమాట. ఈ సినిమా తర్వాత ఆమె చేతికి ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చెయ్యకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సెపెరేట్ ఇమేజి ని ఏర్పర్చుకుంది. రీసెంట్ గానే ఆమె తేజ దర్శకత్వం లో తెరకెక్కిన ‘అహింస’ అనే చిత్రం లో నటించింది.
ఈ సినిమాతో పాటుగా ఆమె పలు టీవీ షోస్ కి న్యాయ నిర్ణేతగా వ్యహరిస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి తనదైన అభిప్రాయం చెప్పుకొచ్చింది. మీరు ఇప్పటి వాటాకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి సదా సమాధానం చెప్తూ ‘ పెళ్లి చేసుకోలేదు కాబట్టే నేను ఇంత సంతోషం గా ఉంటున్నాను. పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ మొత్తం పోతుంది. నాకు వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం, జంతువులు అంటే ఎంతో ఇష్టం, నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అడవి కి జంతువులతో కాలక్షేపం చేస్తుంటాను.
పెళ్లి చేసుకుంటే ఇలాంటివన్నీ కుదరదు కదా, మన మనసుల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆ అర్థం చేసుకునే మనిషి దొరకడం చాలా కష్టం. ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్తున్నా వాళ్ళందరూ విడిపోతున్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం ఎందుకు అని వైవాహిక జీవితానికి దూరంగా ఉంటున్నాను, మొగుడికంటే పశువులు బెటర్’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.