Mannara Chopra: బాలకృష్ణ డైరెక్టర్ ముద్దాడటంపై హీరోయిన్ మన్నారా ఉహించని రియాక్షన్… సెట్స్ లో ఆయన అలా చేశారంటూ!

దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్ లో దర్శకుడు హీరోయిన్ ని ముద్దాడటం ఏంటంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ ని రవి కుమార్ చౌదరి ఖండించారు. ఆయన కొంచెం ఘాటైన సమాధానం చెప్పాడు.

  • Written By: SRK
  • Published On:
Mannara Chopra: బాలకృష్ణ డైరెక్టర్ ముద్దాడటంపై హీరోయిన్ మన్నారా ఉహించని రియాక్షన్… సెట్స్ లో ఆయన అలా చేశారంటూ!

Mannara Chopra: రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి తిరగబడర సామీ అనే మూవీ చేశారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో చిత్ర యూనిట్ ముచ్చటించారు. అయితే దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి పక్కనే ఉన్న మన్నారా చోప్రాను ముద్దుపెట్టుకోవడం చర్చకు దారి తీసింది. ఆమెతో ఫోటోలు దిగే క్రమంలో రవికుమార్ చౌదరి కిస్ చేశాడు. ఆమె సిగ్గుపడి నవ్వుతూ పక్కకు వెళ్ళిపోయింది.

దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్ లో దర్శకుడు హీరోయిన్ ని ముద్దాడటం ఏంటంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ ని రవి కుమార్ చౌదరి ఖండించారు. ఆయన కొంచెం ఘాటైన సమాధానం చెప్పాడు. నా భార్యకు, మన్నారా చోప్రాకు లేని నొప్పి మీకెందుకు. నేనేమైనా కసిగా ముద్దు పెట్టానా?. మా అమ్మాయిని కూడా ఇలానే ముద్దాడతాను. ఆ అమ్మాయి సినిమా కోసం చాలా కష్టపడింది. అందుకే ఆప్యాయంగా ముద్దాడాను, అన్నారు.

తాజాగా మన్నారా చోప్రా ఈ ఘటనపై ఓపెన్ అయ్యారు. ఆమె రవికుమార్ చౌదరిని సమర్ధించారు. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ… ఆయన దురుద్దేశంతో నాకు ముద్దు పెట్టాడని అనుకోవడం లేదు. షూటింగ్ లో నన్ను భేటీ అని పిలిచేవారు. నా యాక్టింగ్ నచ్చి పలుమార్లు మెచ్చుకున్నారు, అని మన్నారా చెప్పుకొచ్చారు. దీంతో వివాదానికి తెరపడింది. వారిద్దరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా దురుద్దేశం లేదంటున్నారు. కాబట్టి దీనిపై చర్చ ఆపేస్తే బెటర్ అంటున్నారు.

ఇక రవికుమార్ చౌదరి యజ్ఞం వంటి సూపర్ హిట్ మూవీ తీశారు. బాలకృష్ణతో చేసిన వీరభద్ర మాత్రం ప్లాప్ అయ్యింది. ఇటీవల యజ్ఞం హీరో గోపీచంద్ పై మండిపడ్డాడు. విలన్ గా ఉన్నవాడిని హీరోని చేశాను. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. లెక్క చేయడం లేదు. మరీ అంత పొగరు పనికిరాదని గోపీచంద్ పై విరుచుకుపడ్డాడు. ఇవన్నీ తన మూవీకి ప్రచారం కల్పించుకోడం కోసం చేస్తున్నాడని కొందరు భావిస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు