Keerthi Suresh : ఆ మిస్టరీ మాన్ ని పరిచయం చేయడానికి టైమ్ ఉంది… పెళ్లి పై కీర్తి సురేష్ ఓపెన్ కామెంట్స్ 

నా జీవితంలో మిస్టరీ మాన్ అంటూ ఎవరూ లేరు. ఉన్నప్పుడు మీకు పరిచయం చేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. నా పెళ్లిపై ప్రతిసారి తప్పుడు వార్తలే రాశారు…. అంటూ కీర్తి సురేష్ కుండబద్దలు కొట్టింది. 

  • Written By: SRK
  • Published On:
Keerthi Suresh : ఆ మిస్టరీ మాన్ ని పరిచయం చేయడానికి టైమ్ ఉంది… పెళ్లి పై కీర్తి సురేష్ ఓపెన్ కామెంట్స్ 

Keerthi Suresh : కీర్తి సురేష్ కి పెళ్లీడు వచ్చింది. గత ఏడాది కాలంగా ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని కీర్తి ప్రేమిస్తున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ స్టార్ హీరోకి దగ్గరైందని అన్నారు. వీరెవరూ కాదు.. ఆమె తన క్లాస్ మేట్ తో ప్రేమలో ఉంది. గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. అతనితో కీర్తి పెళ్ళికి రంగం సిద్ధం అవుతుందని వార్తలు వినిపించాయి. ఈ పుకార్లను ఒకటి రెండు సందర్భాల్లో కీర్తి సురేష్ తల్లి మేనక ఖండించారు. 

ఇటీవల మరో వార్త తెరపైకి వచ్చింది. కీర్తి సురేష్ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఇతనే. ఎవరీ మిస్టరీ మాన్ అంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించారు. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ని ఈ వార్తల్లోకి లాగారా(నవ్వుతు). నా జీవితంలో మిస్టరీ మాన్ అంటూ ఎవరూ లేరు. ఉన్నప్పుడు మీకు పరిచయం చేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. నా పెళ్లిపై ప్రతిసారి తప్పుడు వార్తలే రాశారు…. అంటూ కీర్తి సురేష్ కుండబద్దలు కొట్టింది. 
 
కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను ఇంకెవరినీ జీవిత భాగస్వామిగా ఎంచుకోలేదు. ఎవరినీ ఇష్టపడలేదు. అది జరిగినప్పుడు కచ్చితంగా చెబుతానని కీర్తి చెప్పకనే చెప్పింది. ఇక కీర్తి సురేష్ కెరీర్ మరలా ఊపందుకుంది. ఆమె తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. సర్కారు వారి పాట, దసరా చిత్రాల్లో కీర్తి హీరోయిన్ గా నటించారు. ఇవి రెండు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా దసరా మూవీతో కీర్తి భారీ విజయం అందుకుంది. 
 
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాల వరకు కీర్తి సురేష్ ఖాతాలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అనూహ్యంగా ఈ మూవీలో ఆమెది హీరో చెల్లి పాత్ర. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతూ చెల్లి పాత్రలు చేయడం ఊహించని పరిణామం. అలాగే కీర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. భోళా శంకర్ దసరా కానుకగా విడుదల కానుంది.  

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు