Balagam Heroine Kavya: దర్శకులు నాపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు… బలగం హీరోయిన్ కావ్య సీరియస్ ఆరోపణలు
దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం 2023 సెన్సేషన్స్ లో ఒకటిగా అవతరించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ కమర్షియల్ హిట్ కొట్టింది. పదుల సంఖ్యలో అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. హీరో ప్రియదర్శి మరదలు పాత్రలో కావ్య నటించింది. బలగం అద్భుత చిత్రంగా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో నటులందరూ ఫేమస్ అయ్యారు.

Balagam Heroine Kavya: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మసూద చిత్రంలో కావ్య హీరోయిన్ గా చేశారు. మసూద హారర్ థ్రిల్లర్. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు చేశారు. చిన్న చిత్రంగా విడుదలై మంచి పేరు తెచ్చుకుంది మసూద. దర్శకుడు ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. అయితే మసూద మూవీలో కావ్యకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. అయితే బలగం చిత్రంతో కావ్య ఫేమ్ తెచ్చుకున్నారు.
దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం 2023 సెన్సేషన్స్ లో ఒకటిగా అవతరించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ కమర్షియల్ హిట్ కొట్టింది. పదుల సంఖ్యలో అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. హీరో ప్రియదర్శి మరదలు పాత్రలో కావ్య నటించింది. బలగం అద్భుత చిత్రంగా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో నటులందరూ ఫేమస్ అయ్యారు.
మాసూద, బలగం చిత్రాలు రెండూ హిట్ అయ్యాయి. మూడో చిత్రంగా కావ్య ఉస్తాద్ చేస్తుంది. కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా నటిస్తున్నాడు. ఉస్తాద్ మూవీ ఆగస్టు 12న విడుదల కానుంది. ఉస్తాద్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న కావ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్ గా అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో దర్శక నిర్మాతలు తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆమె వాపోయారు.
నువ్వు బొద్దుగా ఉన్నావు. ఇలా ఉంటే హీరోయిన్ ఎలా అవుతావు అనేవారట. బాడీలోని కొన్ని పార్ట్స్ పెద్దగా ఉన్నాయని దారుణంగా మాట్లాడేవారట. అప్పుడు ఎదురైన అవమానాలు గుర్తు చేసుకుని కావ్య ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా పదికి పైగా చిత్రాల్లో నటించారు. గంగోత్రి, బాలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కావ్య నటించారు.