Dimple Hayati – Venu Swami : వివాదాస్పద వేణు స్వామితో హీరోయిన్ డింపుల్ హయాతి రహస్య పూజలు!

ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఆమె మీద కేసు పెట్టాడు. తన వాహనాన్ని ఆమె కాలితో తన్నినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో డింపుల్ విచారణ ఎదుర్కొంటుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు డింపుల్ హయాతి వేణు స్వామి సంప్రదించినట్లు తెలుస్తుంది. 

  • Written By: Shiva
  • Published On:
Dimple Hayati – Venu Swami : వివాదాస్పద వేణు స్వామితో హీరోయిన్ డింపుల్ హయాతి రహస్య పూజలు!

Dimple Hayati – Venu Swami : తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా వేణు స్వామి పేరు మారుమ్రోగుతుంది. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి ఫేమస్ అయ్యాడు. హీరోలు, హీరోల భవిష్యత్ ఇదంటూ వేణు స్వామి చేసే కామెంట్స్ సంచలనం రేపుతుంటాయి. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పాడు. రామ్ చరణ్ కూతురుది గొప్ప జాతకం, కీర్తిలో చరణ్, ఉపాసనలను మించిపోతుందని చెప్పాడు. అదే సమయంలో ఆమె చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని వెల్లడించారు. 

 
ఇక వేణు స్వామిని నమ్మే టాలీవుడ్ సెలెబ్స్ ఎందరో ఉన్నారు. అతని చేత పూజలు జరిపించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని విశ్వసిస్తారు. స్టార్ లేడీ రష్మిక మందాన వేణు స్వామి శిష్యురాలు. పలుమార్లు వేణు స్వామి నివాసంలో ఆమె ప్రత్యేక పూజలు జరిపించారు. రష్మిక ఎదుగుదలకు వేణు స్వామి పూజలే కారణం అంటారు. 
 
ఆ మధ్య నిధి అగర్వాల్ కూడా వేణు స్వామిని సంప్రదించింది. కొన్ని పూజలు చేయించుకుంది. తాజాగా ఈ లిస్ట్ లో డింపుల్ హయాతి చేరింది. ఈ హైదరాబాద్ బ్యూటీ వేణు స్వామితో రహస్య పూజలు జరిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. డింపుల్ హయాతి కెరీర్ అంతగా బాగోలేదు. ఆమెకు ఆఫర్స్ వస్తున్నా విజయాలు దక్కడం లేదు. 
 
రవితేజకు జంటగా ఖిలాడి చిత్రం చేయగా నిరాశపరిచింది. లేటెస్ట్ రిలీజ్ రామబాణం మరో డిజాస్టర్ అయ్యింది. అలాగే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఆమె మీద కేసు పెట్టాడు. తన వాహనాన్ని ఆమె కాలితో తన్నినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో డింపుల్ విచారణ ఎదుర్కొంటుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు డింపుల్ హయాతి వేణు స్వామి సంప్రదించినట్లు తెలుస్తుంది. 

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు