Heroine Ankitha: నవదీప్ చేసిన పనికి నిద్రమాత్రలు మింగిన హీరోయిన్ అంకిత… అసలు ఏం జరిగింది!

చాలా కాలం తర్వాత అంకిత మీడియాతో మాట్లాడారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విజయేంద్రవర్మ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా సక్సెస్ అయితే నా పరిస్థితి వేరుగా ఉండేది. పరిశ్రమలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుందన్నారు. ఎన్టీఆర్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నాను. ఒకసారి అల్లు అర్జున్ ని కలిశాను. మంచి ఆఫర్ వస్తే నటించేందుకు సిద్ధం అన్నారు.

  • Written By: Shiva
  • Published On:
Heroine Ankitha: నవదీప్ చేసిన పనికి నిద్రమాత్రలు మింగిన హీరోయిన్ అంకిత… అసలు ఏం జరిగింది!

Heroine Ankitha: లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో వెండితెరకు పరిచయమైన అంకిత సింహాద్రి చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు భారీ ఫేమ్ వచ్చింది. టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ ఆమె తలుపుతట్టాయి. బాలకృష్ణకు జంటగా విజయేంద్రవర్మ చేసింది. ఆ చిత్రం మాత్రం నిరాశపరిచింది. త్వరగా ఫేడ్ అవుట్ అయిన అంకిత 2009లో చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. 2016లో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అంకితకు ఇద్దరు పిల్లలు అని సమాచారం.

చాలా కాలం తర్వాత అంకిత మీడియాతో మాట్లాడారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విజయేంద్రవర్మ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా సక్సెస్ అయితే నా పరిస్థితి వేరుగా ఉండేది. పరిశ్రమలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుందన్నారు. ఎన్టీఆర్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నాను. ఒకసారి అల్లు అర్జున్ ని కలిశాను. మంచి ఆఫర్ వస్తే నటించేందుకు సిద్ధం అన్నారు.

ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వారు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ఈ సందర్భంగా హీరో నవదీప్ వివాదంపై స్పందించారు. నవదీప్ తో నాకు ఎలాంటి వివాదం లేదు. నవదీప్ సినిమాతో పాటు ఒక తమిళ సినిమా ఒకేసారి చేయాల్సి వచ్చింది. దాని వలన ఒత్తిడికి లోనయ్యాను. కొంచెం అసహనానికి గురయ్యాను. అంతకు మించి ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చారు.

కాగా 2005లో మనసు మాట వినదు సినిమా షూటింగ్ సెట్స్ లో నవదీప్ అంకితను వేధించాడని, ఆమె నిద్రమాత్రలు మింగారని కథనాలు వెలువడ్డాయి. ఈ వివాదం గురించి నవదీప్ ఆలీతో సరదాగా షోలో స్పందించారు. అంకిత నందమూరి హీరోలతో రెండు హిట్స్ ఇచ్చింది ఉంది. ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. కుదిరినప్పుడల్లా మా సినిమాకు డేట్స్ ఇస్తుంది. ఒక దశలో నాకు కుదరదని ఆమె చెప్పడంతో నిర్మాత పట్టుబట్టి షూటింగ్ కి రప్పించాడు. నిర్మాత మీద ఉన్న అసహనం నా మీద చూపించింది. నా మీద జోక్స్ వేస్తున్నావ్ అంటూ నాతో గొడవకు దిగింది.

నీకు సమస్య నిర్మాతతో నాతో కాదు. నా మీద ఎందుకు కోప్పడుతున్నావ్ అని నేను అన్నాను. షూటింగ్ సెట్స్ లో నవదీప్ ని నేను కొట్టాలి. అప్పుడే షూటింగ్ చేస్తా అని డిమాండ్ చేసింది. తర్వాత వచ్చి నాదే తప్పు వదిలేయ్ అంది. షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వస్తుంటే నాకు ఫోన్… నువ్వు అంకితను వేధించావట. ఆమె ఆత్మహత్య చేసుకోబోయిందట అని. నేను షాక్. తర్వాత నాగబాబు కూడా నాకు మద్దతుగా మాట్లాడారు. నవదీప్ అలాంటి వాడు కాదని చెప్పాడని, నవదీప్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు