Heroine Adah Sharma Injured: తీవ్రమైన గాయాలు, ఒంటినిండా రక్తపు మరకలు: ఆసుపత్రిలో ది కేరళ స్టోరీ డైరెక్టర్, హీరోయిన్

సుదీప్తో సేన్ ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రకు ముఖ్యఅతిథిగా హాజరవ్వాల్సి ఉండేది. అయితే ప్రమాదం కారణంగా ఆయన హాజరు కాలేకపోయారు.. ఈ నేపథ్యంలో హిందూ ఏక్తా యాత్రకు హాజరు కాకపోవడం బాధగా ఉందంటూ ఆయన అడ్మిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Written By: Bhaskar
  • Published On:
Heroine Adah Sharma Injured: తీవ్రమైన గాయాలు, ఒంటినిండా రక్తపు మరకలు: ఆసుపత్రిలో ది కేరళ స్టోరీ డైరెక్టర్, హీరోయిన్

Heroine Adah Sharma Injured: “ది కేరళ స్టోరీ” సినిమా ద్వారా ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయిన దర్శకుడు సుదీప్తోసేన్, హీరోయిన్ ఆదాశర్మ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండగా వారు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దేహం నిండా రక్తపు మరకలతో విలవిలలాడి పోయారు. అక్కడి స్థానికులు వారిద్దరిని ముంబైలోని ఒక ఆసుపత్రికి తరలించారు. వారిద్దరికీ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు.

అనుమానాలు

అయితే ఇది ప్రమాదమేనా? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే “ది కేరళ స్టోరీ”సినిమా తర్వాత సుదీప్తో సేన్, అదా శర్మ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. కొంతమంది అంతమొందిస్తామంటూ కాల్స్ చేస్తున్నారు. మరోవైపుది కేరళ స్టోరీ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. భారీ వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా మత ఘర్షణలకు తావు ఇచ్చే విధంగా ఉందంటూ మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో సినిమా ప్రదర్శించకుండా అడ్డుకున్నప్పటికీ.. కోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ది కేరళ స్టోరీ వివాదాస్పద చిత్రంగా ముద్ర వేసుకోవడంతో వసూళ్ళు భారీగా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

కరీంనగర్ రావాల్సి ఉండేది

అయితే సుదీప్తో సేన్ ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రకు ముఖ్యఅతిథిగా హాజరవ్వాల్సి ఉండేది. అయితే ప్రమాదం కారణంగా ఆయన హాజరు కాలేకపోయారు.. ఈ నేపథ్యంలో హిందూ ఏక్తా యాత్రకు హాజరు కాకపోవడం బాధగా ఉందంటూ ఆయన అడ్మిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరీంనగర్ ప్రజలు తనను మన్నించాలని అందులో కోరారు. మరో వైపు ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎలా జరిగి ఉంటుంది అంటూ కారణాలు అన్వేషిస్తున్నారు. అయితే “ది కేరళ స్టోరీ” ఓ వర్గం అసలు రంగును బయట పెట్టడంతో.. వారు దానిని జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మరో వర్గం వారు విమర్శిస్తున్నారు.. “ది కేరళ స్టోరీ” దర్శకుడు, కథానాయక రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు