తెలుగు ఇండస్ట్రీలో విజయ్ కెరీర్ ఫ్లాపేనా… ?

చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం బాలేదనే చెప్పాలి… మొదట్లో సంచలన హీరోగా మారి, యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తరువాత మరో హిట్ సినిమాకు ఆమడ దూరంలో ఉన్నాడు. అయితే గత మూడు సంవత్సరాలుగా సరైన హిట్ లేక పోవడంతో అతడు కిందా మీద పడటంతో పాటు గత శుక్రవారం విడుదలైన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా అతడి కెరీర్ ను […]

  • Written By: Raghava
  • Published On:
తెలుగు ఇండస్ట్రీలో విజయ్ కెరీర్ ఫ్లాపేనా… ?

చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం బాలేదనే చెప్పాలి… మొదట్లో సంచలన హీరోగా మారి, యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తరువాత మరో హిట్ సినిమాకు ఆమడ దూరంలో ఉన్నాడు.

అయితే గత మూడు సంవత్సరాలుగా సరైన హిట్ లేక పోవడంతో అతడు కిందా మీద పడటంతో పాటు గత శుక్రవారం విడుదలైన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా అతడి కెరీర్ ను మరింత రిస్క్ లో పెట్టింది.

“వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా తనకు పూర్వ వైభవం వస్తుందని భావించిన విజయ్ కు చుక్కెదురైంది. ఈ సినిమా మొదటి రోజునే అట్టర్ ప్లాప్ సినిమాగా బిరుదు మూటకట్టుకుంది. యూఎస్ మార్కెట్లో అయితే అతడి కెరీర్ మరింత దిగజారిందనే చెప్పాలి.

గతంలో విడుదల అయిన “నోటా” సినిమా కన్నా తక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి ఆలోచనలో పడ్డాడు.

సంబంధిత వార్తలు