Vijay Antony Daughter: హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా సూసైడ్… వైరల్ అవుతున్న వీడియో!
సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. భగవంతుడు విజయ్ ఆంటోని కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని జీవితంలో ఇది రెండో విషాదం.

Vijay Antony Daughter: హీరో విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు ఝామున మీరా ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నై చర్చ్ పార్క్ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న మీరా మానసిక ఒత్తిడి కారణంగా ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. విజయ్ ఆంటోని కూతురు మరణం కోలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు చిత్ర ప్రముఖులు విజయ్ ఆంటోని ఇంటికి వెళ్లారు. ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. భగవంతుడు విజయ్ ఆంటోని కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని జీవితంలో ఇది రెండో విషాదం. ఆయన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. తండ్రి మరణించే నాటికి విజయ్ ఆంటోని వయసు 7 ఏళ్ళు అని సమాచారం.
మీరా ఆంటోని మరణం నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. చర్చ్ పార్క్ స్కూల్ కి కల్చరల్ సెక్రెటరీగా మీరా ఆంటోని నియమింపబడింది. వేదికపైకి పిలిచి టీచర్స్ ఆమెతో ప్రమాణం చేయించారు. కల్చరల్ సెక్రెటరీగా తన బాధ్యతలు గొప్పగా నిర్వహిస్తానని మీరా విశ్వాసంతో ప్రమాణం చేసింది. సదరు వీడియోలో మీరా కాన్ఫిడెన్స్ చూస్తే… ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నాం అన్నారు. అంతమంది స్టూడెంట్స్ నుండి ఆమె కల్చరల్ సెక్రెటరీగా ఎంపికైందంటే చాలా యాక్టీవ్ స్టూడెంట్ అని అర్థం అవుతుంది.
అలాంటి అమ్మాయి చదువు ఒత్తిడితో ప్రాణాలు తీసుకుందంటే నమ్మలేం అంటున్నారు. ఈ వీడియోని మీరా తల్లి ఫాతిమా గతంలో పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతుంది. ఇక విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన నటించిన బిచ్చగాడు భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. కిల్లర్ మూవీ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల బిచ్చగాడు 2తో మరో హిట్ కొట్టాడు.
Thank you lord for all these Blessing, we r unworthy,ur love is great.congrats Meera Vijay Antony ❤️❤️❤️❤️ pic.twitter.com/VsKPdyeB0B
— Fatima (@mrsvijayantony) June 25, 2023
