Sumanth Prabhas: మహేష్ బాబు మా సినిమాని చూపించడమే మేము చేసిన అతి పెద్ద తప్పు అంటూ ‘మేము ఫేమస్’ హీరో సుమంత్ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్
ఇక ఈ చిత్రాన్ని చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి వంటి వారు ట్విట్టర్ లో ట్వీట్స్ వేసి మరీ హీరో/ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచి ఎత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా జనాల్లోకి బాగా రీచ్ అవ్వడానికి కారణం కూడా వీళ్లిద్దరి ట్వీట్స్ అని చెప్పొచ్చు.

Sumanth Prabhas: రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘మేము ఫేమస్’. సినిమా మొత్తం కొత్తవాళ్ళని పెట్టి తీసి సరికొత్త ప్రయోగమే చేసింది చాయ్ బిస్కెట్ సంస్థ. అయితే కంటెంట్ బాగుండాలే కానీ, నటీనటులు ఎవరు ఏమిటి అనే విషయం చూడకుండా, థియేటర్స్ కి క్యూ కట్టేస్తుంటారు ఆడియన్స్. రీసెంట్ గా కొన్ని సినిమాల విషయం లో ఇది నిజమైంది, ఇప్పుడు ‘మేము ఫేమస్’ చిత్రం ద్వారా ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.
ఇక ఈ చిత్రాన్ని చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి వంటి వారు ట్విట్టర్ లో ట్వీట్స్ వేసి మరీ హీరో/ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచి ఎత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా జనాల్లోకి బాగా రీచ్ అవ్వడానికి కారణం కూడా వీళ్లిద్దరి ట్వీట్స్ అని చెప్పొచ్చు.
అయితే మహేష్ బాబు నుండి ఎప్పుడైతే ఈ ట్వీట్ పడిందో అప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ నుండి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఎందుకంటే మా అభిమాన హీరో మీకు క్లోజ్ అని ప్రతీ చిన్న విషయానికి ఆయన్ని తెగ వాడేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ‘మేము ఫేమస్’ చిత్రం టీం పై ఫైర్ అయ్యారు. దీనిపై హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ‘ మహేష్ బాబు గారికి మా సినిమాని చూపించడమే పెద్ద తప్పు అయిపోయింది. ఆయన మా సినిమా చూసి మెచ్చుకొని ట్వీట్ వేశారు. దాంట్లో నెటిజెన్స్ అంతలా నెగటివిటీ ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదంతా చూస్తుంటే ఎవరో పగబట్టి మా సినిమాని గట్టిగా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు అనే విషయం అర్థం అవుతుంది’ అంటూ సుమంత్ ప్రభాస్ ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆరోపించారు.