Hero Shivaji: బిగ్ బాస్ హౌస్లోకి హీరో శివాజీ… వివాదాల కోసమేనా?
2016లో సడన్ గా పరిశ్రమకు దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ విభజన నన్ను కలచివేసింది. సినిమాలు మానేయడానికి ఇది కూడా కారణం అని ఓ సందర్భంలో అన్నారు.

Hero Shivaji: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుండి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ వీరే అంటూ కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా హీరో శివాజీ పేరు తెరపైకి వచ్చింది. హీరో శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా ఎంపికయ్యారని టాలీవుడ్ టాక్. మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన శివాజీ హీరో అయ్యాడు. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది చిత్రాలు ఆయనకు బ్రేక్ ఇచ్చాయి. ఒక దశలో హీరోగా వరుస చిత్రాలు చేశాడు.
2016లో సడన్ గా పరిశ్రమకు దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ విభజన నన్ను కలచివేసింది. సినిమాలు మానేయడానికి ఇది కూడా కారణం అని ఓ సందర్భంలో అన్నారు. ఇక పొలిటికల్ కామెంట్స్ తో శివాజీ మరింత పాపులర్ అయ్యారు. కొన్నాళ్లుగా ఆయన అమెరికాకే పరిమితమయ్యారు. అక్కడే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియా వస్తారు. వచ్చారంటే ఏదో ఒక కాంట్రవర్సీ రాజేస్తాడు.
ఈ వివాదాస్పద నటుడు శివాజీ బిగ్ బాస్ షోలో పాల్గొంటే కావాల్సినంత కాంట్రవర్సీ కంటెంట్ కి ఆస్కారం ఉంది. అందుకే ఎంపిక చేశారని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. అలాగే హీరోయిన్ ఫర్జానా సైతం ఎంపికయ్యారని అంటున్నారు. ఫర్జానా సీమశాస్త్రి, చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు.
ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌస్లు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఉంటారట. పది మంది చొప్పున విభజించింది. రెండు హౌస్లలో ఉంచుతారట. గేమ్స్, టాస్క్స్, పెర్ఫార్మన్స్ ఆధారంగా హౌస్ మేట్స్ ని మార్చేస్తూ ఉంటారట. ఇక వరుసగా ఐదో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీజన్ 3 నుండి నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నారు. సీజన్ 7 కూడా ఆయన సారథ్యంలో నడవనుంది.
