Sharwanand Engagement: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా ఇన్ని రోజులు చలామణీ అయినా ప్రముఖ హీరో శర్వానంద్ ఇప్పుడు తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పేసాడు..హైదరాబాద్ కి చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిన్న ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు..హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో జరిగిన వీళ్లిద్దరి నిశ్చితార్ధ మహోత్సవానికి శర్వానంద్ కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Sharwanand Engagement
ముఖ్యంగా శర్వానంద్ కి చిన్నతనం నుండి ప్రాణ స్నేహితుడైన రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన తో కలిసి ఈ నిశ్చితార్ధ వేడుకలో సందడి చేసారు..ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి..రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ సందర్భంగా శర్వానంద్ కి శుభాకాంక్షలు తెలియచేసారు..అయితే శర్వానంద్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
రక్షిత రెడ్డి ఒక ప్రముఖ రాజకీయనాయకుడికి సంబంధించిన మనవరాలు అట..అతను తెలుగు దేశం పార్టీ చెందిన సీనియర్ నాయకుడు అట..ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు..ఇక రక్షిత శెట్టి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈమె అమెరికా లో స్థిరపడిన NRI..అక్కడ MS పూర్తి చేసి ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంజనీర్ గా పనిచేస్తుంది..ప్రస్తుతం ఇంటి నుండే పని చేసుకునే వెసులుబాటు కల్పించడం తో ఆమె హైదరాబాద్ నుండే పని చేస్తుంది..నెలకి 7 లక్షల రూపాయిల జీతం.

Sharwanand Engagement
ఇక ఆమె పేరు మీదనే హైదరాబాద్ లో చాలా ఆస్తులే ఉన్నాయి..వాటి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా..ఇక శర్వానంద్ కూడా మంచి ఆస్తిపరుడు అనే విషయం తెలిసిందే..హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లినా శర్వానంద్ కి భూములు ఉంటాయని ఇండస్ట్రీ లో ఒక పెద్ద టాక్ కూడా ఉంది..అలా అన్నీ విధాలుగా రెండు రిచ్ ఫ్యామిలీలు ఒకటైన సందర్భంగా శర్వానంద్ కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.