Ranbir Kapoor- Adipurush: అనాధ పిల్లల కోసం 10000 ‘ఆదిపురుష్’ టికెట్స్ కొనుగోలు చేసిన ‘బ్రహ్మాస్త్ర’ హీరో రణబీర్ కపూర్
రణబీర్ కపూర్ ప్రభాస్ కి అత్యంత ఆప్త మిత్రులలో ఒకడు, బాలీవుడ్ కి వెళ్ళినప్పుడల్లా ప్రభాస్ ఇతనిని కలుస్తూ ఉంటాడు. వీళ్లిద్దరు కలిసి పార్టీలకు పబ్బులకు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే టీ సిరీస్ సంస్థ కూడా రణబీర్ కపూర్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. అందుకే ఆయన ఈ బృహత్తర కార్యక్రమం లో పాలు పంచుకున్నాడని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.

Ranbir Kapoor- Adipurush: ఇండియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన ‘ఆదిపురుష్’ మూవీ ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయా ఎప్పుడు బుక్ చేసుకుందామా అనే ఆత్రుత లో ఉన్నారు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకముందే, ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ టికెట్స్ ని తెలంగాణాలో ఉన్న అనాదశరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు మరియు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా 10 వేల టికెట్స్ పంపిణీ చెయ్యబోతున్నట్టుగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రకటన పట్ల అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తపరిచారు. ఇక ఈ సినిమాకి సంబంధించి 10 వేల హిందీ టికెట్స్ ని కొనుగోలు చేసి, అనాధపిల్లలకు ఇచితంగా ఇస్తున్నట్టుగా ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించాడు. హిందీ సినిమాలను చూసే ప్రతీ ఒక్కరికి ఈయన సుపరిచితమే, ఇక గత ఏడాది విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.
రణబీర్ కపూర్ ప్రభాస్ కి అత్యంత ఆప్త మిత్రులలో ఒకడు, బాలీవుడ్ కి వెళ్ళినప్పుడల్లా ప్రభాస్ ఇతనిని కలుస్తూ ఉంటాడు. వీళ్లిద్దరు కలిసి పార్టీలకు పబ్బులకు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే టీ సిరీస్ సంస్థ కూడా రణబీర్ కపూర్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. అందుకే ఆయన ఈ బృహత్తర కార్యక్రమం లో పాలు పంచుకున్నాడని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.
ఇది ఇలా ఉండగా రణబీర్ కపూర్ కూడా త్వరలోనే రామాయణం లో నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు. ఇందులో రణబీర్ కపూర్ సతీమణి అలియా భట్ సీతగా, అలాగే రావణాసురిడిగా KGF హీరో యాష్ నటించబోతున్నట్టుగా గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తున్న వార్త.