Bigg Boss 7 Telugu Naveen Polishetty: 15వ కంటెస్టెంట్ గా హీరో నవీన్ పోలిశెట్టి… బిగ్ బాస్ 7లో అనూహ్య పరిణామం!
మీరందరూ ప్రస్తుతానికి కంటెస్టెంట్స్ మాత్రమే. ఇంకా హౌస్ మేట్స్ కాలేదు. మీరు పవరాస్త్రం సంపాదించిన రోజే హౌస్ మేట్ అవుతారు. దాని కోసం కష్టపడాల్సి ఉందని చెప్పాడు.

Bigg Boss 7 Telugu Naveen Polishetty: 15వ బిగ్ బాస్ సీజన్ లో కేవలం 14మంది కంటెస్టెంట్స్ మాత్రమే పాల్గొంటున్నారు. కనీసం 20 మంది కంటెస్టెంట్స్ ఉంటారని ప్రచారం జరిగింది. గతంలో అత్యధికంగా 21 మంది అత్యల్పంగా 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తెలుగు షోలు నడిచాయి. మరి సీజన్ 7లో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ ని పంపడం వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికర పరిణామం. హోస్ట్ నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్ ని వేదికపైకి పిలిచి ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే వారు అప్పుడే హౌస్ మేట్స్ కాదన్నాడు.
మీరందరూ ప్రస్తుతానికి కంటెస్టెంట్స్ మాత్రమే. ఇంకా హౌస్ మేట్స్ కాలేదు. మీరు పవరాస్త్రం సంపాదించిన రోజే హౌస్ మేట్ అవుతారు. దాని కోసం కష్టపడాల్సి ఉందని చెప్పాడు. ఇక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని పరిశీలిస్తే… ప్రియాంక సింగ్, శివాజీ, సింగర్ దామిని, యాక్టర్ ప్రిన్స్ యావర్, శుభశ్రీ రాయగురు, నటి షకీల, ఆట సందీప్, కార్తీకదీపం ఫేమ్ శోభిత శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతిక, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, నటుడు అమర్ దీప్ చౌదరి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.
అయితే అనూహ్యంగా 15వ కంటెస్టెంట్ గా నవీన్ పోలిశెట్టి హౌస్లో అడుగుపెట్టాడు. నవీన్ పోలిశెట్టిని హోస్ట్ నాగార్జున హౌస్లోకి పంపారు. ఓ పాప్యులర్ హీరో సీజన్ 7లో పాల్గొనడం అనూహ్య పరిణామం. అయితే ఆయన రియల్ కంటెస్టెంట్ కాకపోవచ్చు. కేవలం తన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అతడు ఎంట్రీ ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి 14 మందే కంటెస్టెంట్స్… మిగతా ఆరుగురు ఎప్పుడు ఎలా వస్తారనేది చూడాలి.
