Hero Daughter With Delivery Boy: ‘డెలివరీ బాయ్స్’తో హీరోగారి కూతురు డ్రామాలు.. ఇది మాములు రచ్చ కాదు !

  • Written By:
  • Updated On - May 20, 2022 / 06:52 PM IST

Hero Daughter With Delivery Boy: డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో వచ్చిన సినిమా శేఖర్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే, శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక హైలైట్ గా నిలిచారు. అయితే, యాంకర్ నిఖిల్.. శివానీ, శివాత్మికలను పర్సనల్ క్వశ్చన్స్ అడిగి వారిని ఆట పట్టించాడు.

Sekhar

‘మీ ఇంట్లో ఎవరు ఎక్కువగా అల్లరి చేస్తారు.. ? అలాగే, ఎవరు ఎక్కువ సేపు రెడీ అవుతారు ?, ఎవరు ఎక్కువగా ఫుడ్ కోసం ఖర్చు పెడతారు ? అంటూ ఇలా ఫన్నీ క్వశన్స్ అడిగాడు. ఈ ప్రశ్నలకు జీవిత రాజశేఖర్ బదులిస్తూ.. ‘ఇద్దరూ ఫుడ్ మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. మెయిన్ గా చూసుకుంటే.. శివానీనే. ఒక్కోసారి స్విగ్గీ వాళ్లతో గొడవలు కూడా పెట్టుకుంటుంది. వాళ్ళు ఫుడ్ తీసుకు రావడం ఆలస్యమైతే.. డబ్బులు కూడా ఇవ్వదు అని, వారితో చాలా డ్రామా కూడా ప్లే చేస్తోందని’ జీవిత చెప్పుకొచ్చింది.

Also Read: Shekar Movie Review: రివ్యూ : శేఖర్ మూవీ – హిట్టా ? ఫట్టా ?

తల్లి తన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే.. ‘ఇవన్నీ నిన్ను అడిగారా ?’ అంటూ శివాని కాస్త అలక ఫేస్ తో కోపంగా కనిపిచింది. ఇక రెడీ అవ్వడం విషయంలో శివానినే ఎక్కువ సమయం తీసుకుంటుంది అని, అయితే.. కొన్నిసార్లు మాత్రం వెంటనే నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది’ అని జీవిత పుత్రోత్సాహంతో మురిసిపోతూ సెలవిచ్చింది.

Shivani Rajasekhar

అదే విధంగా ‘ఎవరు ఎక్కువగా ఇంట్లో ఇరిటేట్ చేస్తారు ? అనే ప్రశ్నకు జీవిత షాకింగ్ సమాధానం ఇచ్చింది. తానే తన పిల్లలను ఎక్కువగా ఇరిటేట్ చేస్తాను అంటూ జీవిత నిజాయితీగా చెప్పింది. మొత్తానికి శివానీ, శివాత్మికలను యాంకర్ అందరి ముందు ఇరికించే ప్రయత్నం చేశాడు.

Raja Sekhar, Jeevitha

కానీ, జీవిత మాత్రం తన పెద్ద కూతురు శివాని గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పేసి.. ఆమెకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. అయితే, స్విగ్గీ డెలివరీ బాయ్ తో శివాని రాజశేఖర్ గొడవ పడటమే విడ్డూరం. ఫుడ్ లేట్ అయిందని డబ్బులు ఇవ్వకపోతే.. డెలివరీ బాయ్స్ పరిస్థితి ఏమిటో పాపం.

Also Read: Jagan KTR: రహస్య చర్చలకే కేటీఆర్, జగన్ దావోస్ వెళుతున్నారా?