Hero Arjun Becomes Director: హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి యాక్షన్ కింగ్ అనే పేరు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ఏమిటి అంటే, అతి త్వరలోనే ఈయన డైరెక్టర్ గా కూడా మారి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడు అట..

Arjun
వినూతనమైన కథలతో యూత్ లో తనకంటూ ఒక్క ప్రత్యకమైన క్రేజ్ ని ఏర్పర్చుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరో గా నటించబోతున్నాడు అని తెలుస్తుంది ..ఇటీవలే ఆయన హీరో గా నటించిన ఆకాశ వనం లో అర్జున కళ్యాణం విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతున్న సమయం లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అవ్వడం తో, ఆ మూవీ ప్రభావం ఈ సినిమాపై గట్టిగానే పడింది..

Ashoka Vanamlo Arjuna Kalayanam
Also Read: Keerthy Suresh Devakanya Look: ఎవరీ దేవకన్య.. సోషల్ మీడియాని ఊపేస్తోందే
ఇక ఈ సినిమా తర్వాత ఆయన అర్జున్ దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తాడు అని తెలుస్తుంది..అంతే కాకుండా ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటించబోతుంది అట..తమిళ్ లో ఈమె ఇదివరకే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..ఇప్పటి వరుకు ఏ డైరెక్టర్ కూడా ఆలోచించని ఒక్క సరికొత్త పాయింట్ మీద అర్జున్ ఈ సినిమా స్క్రిప్ట్ ని డెవలప్ చేసాడు అట..కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా ఏకకాలం లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి..ఎన్నో వైవిధ్య పాత్రలతో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యాక్షన్ కింగ్ అర్జున్..డైరెక్టర్ గా కూడా అదే స్థాయిలో అలరిస్తాడో లేదో చూడాలి.

Arjun, Aishwarya
Also Read: Heroine Anjali: హీరోయిన్ అంజలిని దారుణంగా మోసం చేసి ఆర్థికంగా దెబ్బ తీసింది ఎవరో తెలుసా?
Recommended Videos