Adivi Sesh: అడివి శేష్ తన సిస్టర్ మ్యారేజ్ చేస్తున్నారు. నేడు హల్దీ వేడుక నిర్వహిస్తున్నారట. సదరు ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు అడివి శేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియమైన చెల్లి వివాహం. హల్దీ వేడుక నిర్వహిస్తున్నాము. అమ్మా, నేను బావ డేవిడ్ ని మనస్ఫూర్తిగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము, అని కామెంట్ చేశారు. అడివి శేష్ కి కాబోయే బావ డేవిడ్ విదేశీయుడని తెలుస్తుంది. పేరు తప్పా అతని వివరాలేమీ అడివి శేష్ వెల్లడించలేదు. ఈ క్రమంలో ఇది లవ్ మ్యారేజ్ కావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Adivi Sesh
పెద్దలు కుదిర్చే వివాహాలు సొంత కమ్యూనిటీకి చెందినవై ఉంటాయి. ఒకే కమ్యూనిటీ కాకపోయినా… భారతీయులై ఉంటారు. ఎంత ఆల్ట్రా మోడ్రన్ ఫ్యామిలీ అయినప్పటికీ విదేశీయులతో సంబంధం కుదుర్చుకోరు కాబట్టి కచ్చితంగా ఇది లవ్ మ్యారేజే అని మెజారిటీ వర్గాల వాదన. ప్రేమలు-పెళ్లిళ్లు కులం, మతం, భాషా బేధాలు ఎప్పుడో దాటేశాయి. కనీసం ఖండాంతరాలు కూడా లేకుండా పోయాయి. విదేశీ యువతులను, యువకులను పెళ్లాడే సాంప్రదాయం చాలా కాలం క్రితమే స్టార్ట్ అయ్యింది.
సాఫ్ట్ వేర్ కొలువుల కాలం మొదలయ్యాక మరింత ఎక్కువైంది. కాగా అడివి శేష్ సిస్టర్ లండన్ లో మెడిసిన్ చదివినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె ప్రేమలో పడ్డారేమో. హైదరాబాద్ కి చెందిన అడివి శేష్ చదువు సంధ్యలు సాగింది విదేశాల్లోనే. యాక్టింగ్ కెరీర్ కోసం ఆయన ఇండియా వచ్చారు. సప్పోరింగ్ రోల్స్ చేస్తూ టైర్ టు హీరోగా ఎదిగాడు. వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారంటీ హీరో అయ్యాడు.

Adivi Sesh
క్షణం మూవీతో హీరోగా ఫస్ట్ హిట్ కొట్టిన అడివి శేష్ గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. మేజర్ తో ఆయన పాన్ ఇండియా హిట్ కొట్టారు. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ చిత్రాన్ని మహేష్ నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆయన గూఢచారి 2 మూవీలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. గూఢచారి 2 పలు భాషల్లో విడుదల కానుంది. కాగా అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియతో అడివి శేష్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.