Site icon OkTelugu

Ragi Java Health Benefits: ఉదయమే రాగి జావ తీసుకుంటే ఎలాంటి పోషకాలు.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలి..

Ragi Java Health Benefits

Ragi Java Health Benefits

Ragi Java Health Benefits: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ వైపు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ తో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో సహజ ఆహారాలపై ప్రజలు మళ్లీ దృష్టి సారిస్తున్నారు. అలాంటి వాటిలో రాగి ఒక ముఖ్యమైన మిల్లెట్‌గా గుర్తింపు పొందింది. రాగుల్లో ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, అమైనో అమ్లాలు, విటమిన్ సీ, ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి సమగ్ర ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రోజూ ఉదయం రాగి జావ తీసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

రాగి జావను ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ హెల్త్‌ను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే రాగిలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే రాగి జావ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది. రాగి జావలో ఉన్న పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చర్మానికి సహజ నిగారింపు తీసుకువచ్చి యవ్వనాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి ఇది ఉత్తమ ఆహారం, ఎందుకంటే ఇది తక్కువ కాలరీలతో పాటు ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తుంది.

చిన్నపిల్లలకు రాగి జావ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను బలపరచి ఎదుగుదలలో సహాయపడుతుంది. అలాగే కండరాల అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందించి పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్దలు కూడా దీన్ని తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రాగి జావ ఒక సాధారణ ఆహారం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఒక సహజ ఔషధంలాంటిది. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా అందించుకోవచ్చు.

రాగి జావ బయట కొన్ని ప్రదేశాల్లో విక్రయిస్తున్నారు. దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రాగిజావను తయారు చేసుకోవాలంటే ఇలా చేయాలి.

అవసరమైన వస్తువులు:

రాగి పిండి 2 టేబుల్ స్పూన్లు
నీరు ఒక గ్లాస్
పాలు (అవసరం ఉన్నమేరకు) సగం గ్లాస్
బెల్లం లేదా ఉప్పు రుచికి సరిపడా

తయారు చేసే విధానం:

మొదట రాగి పిండిని కొద్దిగా చల్లని నీటిలో కలిపి గడ్డలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు ఒక పాత్రలో మిగిలిన నీటిని వేడి చేసి, అందులో ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌పై 5 నుంచి 10 నిమిషాలు నిరంతరం కలుపుతూ ఉంచాలి. జావ మందంగా మారుతుంది. తీపి కోసం బెల్లం, పాలు కలుపుకోవచ్చు. ఉప్పుగా కావాలంటే ఉప్పు, మజ్జిగ లేదా పెరుగు కలపాలి. ఆ తరువాత పాత్రల్లో సర్వ్ చేసుకోవచ్చు.

Exit mobile version