Peanuts Benefits: చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో కాస్త చీకటి పడిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఉదయం సూర్యోదయం అయితే గానీ నిద్ర లేవ బుద్ది కాదు. దీంతో మెదడు మొద్దుబారిపోతుంది. కొందరికీ ఈ కాలంలో అల్జీమర్ వ్యాధి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చలికాలంలో వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించాలి. వెచ్చగా ఉండటానికి దుప్పటి కప్పుకోవడమే కాకుండా కాస్త వేడిని అందించే పదార్థాలను కూడా తీసుకోవాలి. మరి వేడిని అందించే ఆ పదార్థాలేవంటే?
చలికాలం అనగానే ముసుగేసుకొని పండుకోవాలని అనిపిస్తుంది. కానీ కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఎంతటి చలినైనా తట్టుకోగలుగుతారు. వాటిలో పల్లిలు ప్రధానమైనవి. పల్లీలు పచ్చివి తినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. వీటిని వేడి చేసి తినడం వల్ల శరీరాన్ని వేడిగ ఉంచుతుంది. కేవల పల్లీలు మాత్రమే కాకుండా పల్లీ పట్టీలను కూడా తీసుకోవచ్చు. అలాగే పల్లీలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఉష్ణోగ్రత పెరుగుతుంది.
పల్లీల్లో వేడిని అందించే మాంగనీసు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అందించడం వల్ల శరీరానికి ఉష్ణోగ్రత అందుతుంది. అలాగే యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక చలికాలంలో మెదడు మొద్దుబారిపోతుంది. పల్లీలను తీసుకోవడం వల్ల మెదడుకు వేడి అంది చురుగ్గా మారుతుంది. ఇక అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు పల్లీలను తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు అందిచిన వారవుతారు.
మెదడు చురుగ్గా ఉండేందుకు నియాసిన్, రెస్వెరాట్రాల్, విటమిన్ ఈ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ పల్లీల్లో ఉంటాయి. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచేందుకు ఇవి ఎంతో ఉపకరిస్తాయి. వాతావరణం చల్లగా ఉండడంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల జీర్ణ సమస్యలు తొలిగిపోవాలంటే పల్లీలను ఎక్కువగా తీసుకోవాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.