Site icon OkTelugu

Body heat reduction tips: శరీరంలో హీట్ ఎక్కువగా ఉందా.. ఇవి తీసుకుంటే కూల్ అయిపోతుంది..

Body heat reduction tips

Body heat reduction tips

Body heat reduction tips: కొందరి శరీరం ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇలాంటి వారికి వేసవి రాగానే మరిన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాస్త ఎండవేడి తగలగానే డీ హైడ్రేషన్ కు గురవుతారు. చేతులు, కాళ్లు వేడిగా ఉండటం, నోరు ఎండిపోవడం, తరచూ దాహం వేయడం, కళ్లలో మంటలు, అలసట, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు కనిపించవచ్చు. వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. శరీర ఉష్ణోగ్రత పెరగడానికి నీరు తక్కువగా తాగడం, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువసేపు ఎండలో ఉండటం వంటి కారణాలు ఉండొచ్చు. ఇలాంటి వారు శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరినీళ్లు
శరీరంలోని హీట్ ను తగ్గించడానికి కొబ్బరి నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి. వీటిలో సహజ ఎలక్ట్రోలైట్స్‌తో నిండిన కొబ్బరినీళ్లు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. రోజుకు ఒకసారి తీసుకుంటే డీహైడ్రేషన్ తగ్గుతుంది. అయితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

కలబంద జ్యూస్
అలోవేరాలో చల్లదన గుణాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో కలబంద జ్యూస్ తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ ను ఉదయం పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.

పుదీనా జ్యూస్
మార్కెట్ లో పూదీనా విరివిగా లభిస్తుంది. ఇది శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. పుదీనా ఆకులతో చేసిన జ్యూస్ లేదా నీటిలో వేసుకుని తాగినా ఉపశమనం ఉంటుంది.

మజ్జిగ
వేసవి రాగానే కిరాణాషాపుల్లో బట్టర్ మిల్క్ అందుబాటులో ఉంటుంది. కొందరు దీనీని అవైడ్ చేస్తారు. కానీ ఇది వేసవిలో అత్యుత్తమ సహజ కూలెంట్‌గా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.

వీటితో పాటు విటమిన్ సీ ఉన్న అయిన లెమన్, జామ వంటి పండ్లు తీసుకుంటే శరీరానికి తేమ లభిస్తుంది, వేడి తగ్గుతుంది. అలాగే కీరదోశలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంలో చాలా ఉపయోగపడుతుంది.బీట్‌రూట్ జ్యూస్ తో రక్తప్రసరణను మెరుగుపరచి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. అలాగే ప్రతిరోజూ కనీసం 3నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. మసాలా, వేయించిన ఆహారం తగ్గించాలి. ఎండలో ఎక్కువసేపు తిరగకూడదు. కాటన్ దుస్తులు ధరించాలి. తగినంత నిద్రపోవాలి.

శరీర వేడి తరచూ ఎక్కువగా ఉండి, దానితో పాటు జ్వరం, గుండె వేగం, బలహీనత ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు ఇది హార్మోన్ అసమతుల్యత లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

Exit mobile version