Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం కానీ ఆహారం తీసుకోవడం వల్ల సరైన నిద్ర పట్టడం లేదు. ఇలాంటి సమయంలో తేలికైన ఆహారం తీసుకుంటే మంచి నిద్ర వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని అంటున్నారు. మంచి నిద్ర కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?
చాలామంది రాత్రి సమయంలో అసౌకర్యం కలిగే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. వీడి వల్ల అజీర్ణ సమస్యలు ఏర్పడి కలత నిద్ర ఉండే అవకాశం ఉంది. అయితే రాత్రి సమయంలో జొన్నలు, సజ్జలు, రాగులతో తయారుచేసిన ఆహారాన్ని పరిమితమవుతాదిలో తీసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కడప నిండినట్లు అనిపిస్తుంది. వీటిని తిన్న తర్వాత గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
ఇది మాత్రమే కాకుండా ఉడికించిన లేదా తక్కువ నూనెతో తయారుచేసిన కూరగాయలు, పప్పు వంటి ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకోవచ్చు. పంపుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోగలుగుతారు. కానీ ఇది శరీరానికి అత్యధిక పోషకాలను అందిస్తుంది.
సాయంత్రం చాలామంది ఆహారాన్ని తింటూ ఉంటారు. కానీ దీని స్థానంలో చపాతీతో కూడిన భోజనాన్ని తీసుకోవడం వల్ల కూడా కడుపు నిండినట్లు అనిపించి ఎలాంటి సమస్యలు లేకుండా త్వరగా జీర్ణం అవుతుంది. వీటితోపాటు గోరువెచ్చని పాలు లేదా బాదం పప్పులు, అరటి పండ్లు, ఓట్స్ వంటివి తీసుకోవడం వల్ల కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది.
అయితే ఓవైపు ఇలాంటి ఆహారం తీసుకుంటూనే మరోవైపు కొన్ని రకాల ఆహార పదార్థాలను తగ్గిస్తూ ఉండాలి. ముఖ్యంగా కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించడం వల్ల నిద్ర భంగం కలవకుండా ఉంటుంది. అలాగే ప్రస్తుత కాలంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలికంగా ఆనందం పొందుతారు. కానీ వీటివల్ల అజీర్ణ సమస్యలు ఏర్పడి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే రాత్రి సమయంలో టి, కాఫీలకు దూరంగా ఉండటం వల్ల నిద్ర సమస్యల నుంచి బయటపడవచ్చు.

