Rice Porridge Benefits: కూల్ డ్రింక్స్ కన్నా గంజి తాగడం మేలు.. ఎందుకంటే?
ఇప్పుడున్న వారు ఆరోగ్యకరమైన ఆహారం కంటే రుచికరమైనదాని కోసం వెతుకుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. టేస్టీ ఫుడ్ పేరుతో జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతున్నారు.

Rice Porridge Benefits: అన్నం వండేటప్పుడు కొందరు గంజిని వార్చొద్దు అంటారు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు బయటకు వెళ్తాయంటారు. కానీ ఇలా వార్చిన గంజిని తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నేటి కాలంలో చాలా మంది ప్రెషర్ కుక్కర్లు వాడుతున్నారు. దీంతో బియ్యానికి సరిపోయే విధంగా నీరును వాడుతున్నారు. క్రమంలో గంజి బయటకు రావడం లేదు. కానీ పూర్వ కాలంలో అన్నం వండే సమయంలో గంజిని ప్రత్యేకంగా ఒక పాత్రలో పోసి అందులో కాస్త ఉప్పు వేసుకొని తాగేవారు. ఇలా తాగిన వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. మేం ఒకప్పుడు గంజిని మాత్రమే తాగి బతికాం.. అని పెద్దలు చెబుతూ ఉంటారు.. వీరు చెప్పింది నిజమే. గంజిని మాత్రమే తాగడం వల్ల ఎంతో ఎనర్జీ వస్తుంది.ఇంతకీ ఈ గంజిలో ఎటువంటి విటమిన్ ఉంటుంది? ఇది తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఇప్పుడున్న వారు ఆరోగ్యకరమైన ఆహారం కంటే రుచికరమైనదాని కోసం వెతుకుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. టేస్టీ ఫుడ్ పేరుతో జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతున్నారు. అయితే బరువు పెరగకుండా ఉండాలంటే గంజిని తీసుకోవాలని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు రెగ్యులర్ గా గంజి తాగితే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. బియ్యంతో తీసిన గంజిని మాత్రమే కాకుండా తృణ ధాన్యాలతో తయారు చేసిన జావాలాంటిది తీసుకోవడం మరీ మంచిదని అంటున్నారు. ఇలా తీసుకున్న వారు బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గంజిలో బీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫైబర్ ను కలిగి ఉంటుంది. గంజిలో ఉప్పు, నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల కడుపు నిండినట్లు అవుతుంది. దీంతో బలమైన ఆహారంగా తయారై ఎముకలు పటిష్టంగా మారుతాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు గంజి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ప్రతి రోజు గంజి తాగడం వల్ల ఎనర్జీగా ఉంటారు. అందు చేత కూల్ డ్రింక్స్ కు బదులు గంజిని తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు.
గంజి ఎక్కడ దొరుకుతుంది? ఎవరు అమ్ముతారు? అనే ప్రశ్న కొందరికి ఎదురవుతుంది. గంజి కావాలనుకునేవారు బియ్యంలో కాస్త నీళ్లు ఎక్కువగా కలపాలి. అన్నం కొంచెం ఉడికిటన్లు అవగానే అందులోనే గంజిని ఒక పాత్రలో తీసుకోవాలి. ఇది టేస్టీగా ఉండకపోవచ్చు. ఇందులో కాస్త ఉప్పుతో పాటు నిమ్మరసం వేయడం వల్ల మంచి టేస్టీగా మారుతుంది. ప్రతీ ఉదయం దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
