Health Tips: లైంగిక సామర్థ్యం కోసం ఈ పండ్లను రాత్రంతా పాలల్లో నానబెట్టి.. ఉదయం..
తక్షణ శక్తితో పాటు గ్లూకోజ్ ను నేరుగా ఇచ్చే వీటిలో అంజీరా పండ్ల గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలతో అస్తమాను తగ్గించుకోవచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. అదెలాగంటే?

Health Tips: ఆరోగ్యంగా ఉండడానికి సాంప్రదాయమైన ఆహారం మాత్రమే తింటే సరిపోతుంది. పోషకాలు, విటమిన్లు ఉండే పండ్లను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ తో జీర్ణక్రియ శక్తి పెరగడంతో పాటు అనేక రోగాలను దరి చేరకుండా ఉంచుతాయి. అంతేకాకుండా సాధారణ ఆహారం కన్నా ఇవి ఎక్కువ శక్తిని ఇస్తాయి. అందుకే చాలా మంది అనారోగ్యానికి గురైనప్పుడు ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. తక్షణ శక్తితో పాటు గ్లూకోజ్ ను నేరుగా ఇచ్చే వీటిలో అంజీరా పండ్ల గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలతో అస్తమాను తగ్గించుకోవచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. అదెలాగంటే?
అంజరీ పండ్లను వేల ఏళ్ల సంవత్సరాల నుంచి తింటున్నారు. ఈజీప్టు, టర్కీ, స్పెయిన్ వంటి దేశాల్లో అంజీర ఎక్కువగా సాగవుతుంది. కాలంతో సంబంధం లేకుడా ఎప్పుడంటే అప్పడు అంజీరా పండ్లు మార్కెట్లో లభిస్తాయి. అంజీరాలో విటమిన్ సి, ఏ, బి6 ఉంటాయి. ఇందులో పోటాషియం, కాల్షియంలు అధికంగా ఉంటాయి. అలాగే సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభ్యమవుతాయి. కార్బోహైడ్రేట్లు 6 శాతం ఉండే అంజీరాలు 12 శాతం పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి.
అంజీరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువును తగ్గిస్తుంది. అలాగని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. వేడి చేసినప్పుడు గొంతులో నొప్పి పుడుతంది. దీంతో ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అంజీరాను మెల్లగా తినడం వల్ల నయమవుతుంది. ఇది గొంతులో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. అస్తమా ఉన్నవాళ్లు సైతం అంజీరాలను తీసుకోవచ్చు. అయితే వైద్యుల పర్మిషన్ తో మాత్రమే తీసుకోవాలి.
అంజీరాలను అత్తిపండ్లు అనికూడా ఉంటారు. వీటి పేస్ట్ ను చర్మానికి రాసుకుంటే కాంతివంతంగా మారుతుంది. వాపులపై అంజీరా పేస్ట్ ను అప్లయ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టడానికి అంజీరాలు బాగా సహకరిస్తాయి. ఎమైనో ఆమ్లాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. దీంతో ఎండిన అంజీరాలను తీసుకోవడంతో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. పురుషులు 2 లేదా 3 అంజీరా పళ్లను రాత్రంతా పాలలో నానబెట్టి మరుసటి రోజు ఉద్యం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
