TSPSC Paper Leak Case: బావ కళ్లల్లో ఆనందం కోసం.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాలు దేశం దాటించేసిన రాజశేఖర్‌రెడ్డి
TSPSC Paper Leak Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో రోజుకో సంచలనం బయటకు వస్తోంది. దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు రోజుకో విస్తుపోయే నిజం తెలుస్తోంది. తాజాగా లీకేజీ పేపర్లు ఎన్‌ఆర్‌ఐలకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. రాజశేఖర్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉండే తన బావకు ప్రశ్నపత్రం పంపినట్లు నిర్దారించారు. లీకేజీ వ్యవహారంలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర ఉన్నట్లు మొదటి నుంచి సిట్ అనుమానిస్తోంది. కమిషన్‌లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొదలుకుని ఈ […]


TSPSC Paper Leak Case
TSPSC Paper Leak Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో రోజుకో సంచలనం బయటకు వస్తోంది. దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు రోజుకో విస్తుపోయే నిజం తెలుస్తోంది. తాజాగా లీకేజీ పేపర్లు ఎన్‌ఆర్‌ఐలకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. రాజశేఖర్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉండే తన బావకు ప్రశ్నపత్రం పంపినట్లు నిర్దారించారు. లీకేజీ వ్యవహారంలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర ఉన్నట్లు మొదటి నుంచి సిట్ అనుమానిస్తోంది. కమిషన్‌లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొదలుకుని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా ఎన్‌ఆర్‌ఐలు కావడంపై సిట్ దృష్టి సారించింది. ఈమేరకు నోటీసులు కూడా చారీ చేసింది.
దేశం దాటిన గ్రూప్–1 ప్రశ్నపత్రం..
టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 పేపర్ దేశం దాటినట్టు సిట్‌గుర్తించింది. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి.. న్యూజిలాండ్‌లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌రెడ్డికి వాట్సాప్‌లో పేపర్‌షేర్ చేసినట్లు విచారణలో తేల్చింది. దీంతో అతడికి నోటీసులు జారీ చేసింది. ప్రశాంత్‌రెడ్డి గత అక్టోబర్‌లో ఇండియాకు వచ్చి గ్రూప్–1 పరీక్ష పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. ఇతనికి 103 మార్కుల కంటే ఎక్కువగా వచ్చాయి.
సిట్ నోటీసులు..
రాజశేఖరరెడ్డి బావకు సిట్ అధికారులు వాట్సాప్, మెయిల్ ద్వారా సమాచారం అందించింది. విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే ప్రశాంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేసే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. న్యూజిలాండ్‌లోనే పరీక్షకు ప్రిపేర్ అయిన ప్రశాంత్‌రెడ్డి.. ఇక్కడికొచ్చి పరీక్ష రాశాడు. ప్రశాంత్ ద్వారా మరికొంత మందికి పేపర్ చేరి ఉంటుందని సిట్ అనుమానిస్తోంది
ఎన్‌ఆర్‌ఐ లీడర్ సిఫారసుతోనే రాజశేఖర్‌కు ఉద్యోగం?
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డిది సాధారణ కుటుంబం. అతని అత్తింటివారిదీ అదే పరిస్థితి. అయితే రాజశేఖర్‌రెడ్డి ఎదగడానికి రాజకీయ పరిచయాలే కారణమని, విదేశాల్లో ఉండి రావడంతో హైదరాబాద్ ఎన్‌ఆర్‌ఐ సర్కిల్స్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ నాయకుడి పైరవీతో రాజశేఖర్‌రెడ్డికి టీఎస్‌పీఎస్‌స్సీలో కొలువు దక్కిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

TSPSC Paper Leak Case
గ్రూప్–1లో ‘విదేశీ’ కోణం పరిశీలించాలి..
రాజశేఖర్‌రెడ్డి ఎన్‌ఆర్‌ఐ మిత్రుల్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. 2018లో విదేశాల నుంచి వచ్చిన ఆ ఇద్దరికీ పేపర్ లీక్‌ల ద్వారా రాజశేఖర్‌రెడ్డే కొలువులు దక్కేలా చేశాడని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే సమయంలో రాజశేఖర్‌రెడ్డి మరో ఇద్దరు సన్నిహితులు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి బంధువులు మాత్రం వారు దసరా కోసం వచ్చారని అంటున్నారు. ఈ వ్యవహారం తేలాలంటే.. ఇలా ఎందరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్–1 రాశారో సిట్ పరిశీలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
