Virender Sehwag: నువ్వే కెప్టెన్ అన్నారు.. టీమ్ లో చోటు లేకుండా చేశారు: సెహ్వాగ్
Virender Sehwag: ఇండియన్ క్రికెట్ లో అరవీర భయంకరమైన బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. బౌలర్ ఎవరైనా ఒకటే ఆట తీరుతో చెడుగుడాడే డాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్. టీమ్ కు కెప్టెన్ కావాల్సిన దశలో.. జట్టులో చోటు కోల్పోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. టన్నుల్లో టాలెంట్.. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. టీమిండియాలో సరైన గౌరవం దక్కించుకోలేకపోయాడు వీరేంద్ర సెహ్వాగ్. 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్లలో […]


Virender Sehwag
Virender Sehwag: ఇండియన్ క్రికెట్ లో అరవీర భయంకరమైన బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. బౌలర్ ఎవరైనా ఒకటే ఆట తీరుతో చెడుగుడాడే డాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్. టీమ్ కు కెప్టెన్ కావాల్సిన దశలో.. జట్టులో చోటు కోల్పోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్.
టన్నుల్లో టాలెంట్.. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. టీమిండియాలో సరైన గౌరవం దక్కించుకోలేకపోయాడు వీరేంద్ర సెహ్వాగ్. 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్లలో సభ్యుడుగా ఉన్న అతి కొద్ది మందిలో ఒక్కడైన వీరూ.. కెరీర్ చివర్లో టీంలో చోటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నాటి పరిస్థితులతో పాటు అనేక అంశాలపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వివరాలు చూసేద్దాం.
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలో ఓపెనర్ గా ఎదిగి, సచిన్ టెండుల్కర్ తో కలిసి రికార్డు భాగస్వామ్యాలు నెలకొల్పిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ తరువాత గౌతమ్ గంభీర్ తో కలిసి టీమ్ కు ఎన్నో విజయాలు అందించాడు. 2003 నుంచి 2012 మధ్య తాత్కాలిక సారథిగా 12 మ్యాచ్లు ఆడాడు.
సెహ్వాగ్ ను తప్పించి ధోనీకి చాన్స్..
సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించిన అప్పటి టీమిండియా హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్, రాహుల్ ద్రావిడ్ ని కెప్టెన్ గా నియమించాడు. ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, సెహ్వాగ్ ను పక్కనపెట్టి, మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. దీనిపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఒక సమావేశంలో మాట్లాడుతూ..
‘గ్రెగ్ చాపెల్ హెడ్ కోచ్ గా వచ్చిన సమయంలో చెప్పిన మొదటి స్టేట్మెంట్, టీమిండియాకి తరువాత కెప్టెన్ సేహ్వాగ్ అని. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. రెండు నెలలకే నన్ను టీమ్ నుంచి తప్పించారు. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రైసులో ఉన్న నన్ను.. కెప్టెన్ కాకుండా రాజకీయం చేశారు. నేను ఎప్పుడూ భారత క్రికెట్ జట్టును నడిపించాలంటే మంచి కోచ్ కావాలని అనుకునేవాడిని. మన దగ్గర ఎవరికీ చేతకానట్టు విదేశాల కోచ్ లు అవసరం ఏముంది. ఆడే సమయంలో కూడా నా సీనియర్లను ఇదే అడిగాను’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఫారిన్ కోచ్ అవసరమా..?
‘జాన్ రైట్ తరువాత మళ్లీ మనకు మరో ఫారిన్ కోచ్ అవసరమా అని అడిగాను. వాళ్లంతా కూడా భారత కోచ్ లతో చాలా రోజులు పని చేశారు. వాళ్లతో ఫ్రీగా మాట్లాడుకునేందుకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. అయితే భారత కోచ్ లు ఉంటే వాళ్లు, వాళ్లకు నచ్చిన ప్లేయర్లను టీమ్ లో ఆడిస్తారు. కొందరికి కొందరు ప్లేయర్లు ఫేవరెట్ లుగా ఉంటారు. వాళ్ల కోసం మిగిలిన వాళ్ళను పక్కన పెడతారు. ఫారిన్ కోచ్ వస్తే అలా కాదు… టీమ్ లో ఉండడానికి ఎవరు అర్హులో వారిననే ఆడిస్తారు. అని సీనియర్లు సమాధానం ఇచ్చారు. కానీ నిజానికి ఫారిన్ కోచ్ లు కూడా ఒత్తిడి ఫీల్ అయ్యేవాళ్ళు’ అని సెహ్వాగ్ వివరించాడు.

Virender Sehwag
స్టార్ ప్లేయర్లు టీమ్ ను నడిపించడం సాధారణ విషయం కాదు..
ఇక స్టార్ ప్లేయర్లుతో కూడిన టీమ్ ను నడిపించడం గురించి తన అభిప్రాయాన్ని సెహ్వాగ్ పంచుకున్నాడు.
‘టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్న టీమ్ ను నడిపించడం చిన్న విషయం కాదు. నా వరకైతే టీమిండియాకి కోచ్ అవసరమే లేదు. స్టార్ ప్లేయర్ లు ఉన్న జట్టుకి కావాల్సింది సరైన మ్యాన్ మేనేజర్. అందరూ ప్లేయర్లతో స్నేహాన్ని ఏర్పరచుకుని, ఏ ప్లేయర్ కి ఎంత కోచింగ్ కావాలో తెలిసిన వ్యక్తి. ఏ ప్లేయర్ కి ఎలా చెబితే అర్థం అవుతుందో ఎరిగిన మేనేజర్ కావాలి. ఈ విషయంలో గ్యారీ కిరిస్టన్ బెస్ట్. అతను నాతో 50 బాల్స్ ఆడించేవాడు. ద్రావిడ్, సచిన్లతో 200 బాల్స్ ఆడించేవాడు. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చేవాడు’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.