Mahesh Babu New Look: మహేష్ కొత్త లుక్ చూశారా? సోషల్ మీడియా షేక్ చేస్తున్న పోస్ట్!
మహేష్ కెరీర్లో ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారట. ఇక టైటిల్ విషయంలో కూడా పలు వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట.

Mahesh Babu New Look: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే టక్కున మహేష్ బాబు పేరు చెబుతారు. రెండు దశాబ్దాలుగా మహేష్ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నారు. ఆయన గ్లామర్ అలాంటిది మరి. ఐదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా ఏ మాత్రం గ్లామర్ తగ్గలేదు. ఆయన ఏజ్ 25 దగ్గరే ఆగిపోయింది. మహేష్ తన లేటెస్ట్ లుక్ షేర్ చేయగా వైరల్ అవుతుంది. మెస్సీ హెయిర్ స్టైల్, బెర్డ్ లుక్ లో కేక పుట్టించాడు. మహేష్ తన తాజా లుక్ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
ఇక మహేష్ లాస్ట్ రిలీజ్ సర్కారు వారి పాట సూపర్ హిట్ కొట్టింది. అయితే పూర్తి స్థాయిలో మెప్పించలేదు. భారీ కమర్షియల్ హిట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 28 చిత్రంతో ఫ్యాన్స్ దాహం తీరుతుందని అందరూ నమ్ముతున్నారు. ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రం గురించి కొన్ని క్రేజీ విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఇందులో ఓ పాత్రలో మహేష్ విలన్ గా నటిస్తున్నారట.
మహేష్ కెరీర్లో ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారట. ఇక టైటిల్ విషయంలో కూడా పలు వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట. వీటిలో ఓ టైటిల్ ఫైనల్ చేయనున్నారట. ఇక జూన్ మొదటి వారం నుండి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. నిరవధికంగా మూడు నెలలు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అనుకున్న సమయానికి విడుదల చేయాలంటే బిజీ షెడ్యూల్స్ తప్పదని యూనిట్ భావిస్తున్నారట.
ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మహేష్-పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో వీరి కాంబోలో మహర్షి తెరకెక్కింది. ఇక త్రివిక్రమ్ తో పూజా హెగ్డే కి హ్యాట్రిక్ మూవీ. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల మరో హీరోయిన్ గా నటించడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి ఈ మూవీ విడుదల కానుంది.
