Harshvardhan Rane: ఆ బోల్డ్ బ్యూటీతో డేటింగ్ రూమర్స్… వాళ్లకు టార్గెట్స్ ఉంటాయంటూ హర్షవర్ధన్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తలు రాసే జర్నలిస్టుల మీద నాకేం కోపం లేదు. ఎందుకంటే వారికి టార్గెట్స్ ఉంటాయి. ప్రతివారం చేరుకోవాల్సిన లక్ష్యాలు ఉంటాయి. అందుకే వారు ఇలాంటి నిరాధార కథనాలు రాస్తుంటారని అన్నారు. పరోక్షంగా సంజీదాతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. సంజీదా-హర్షవర్ధన్ తైష్ మూవీలో కలిసి నటించారు. అప్పటి నుండి ఈ ఎఫైర్ రూమర్స్ భగ్గుమన్నాయి. గతంలో హర్షవర్ధన్ హీరోయిన్ కిమ్ శర్మతో ఎఫైర్ నడిపినట్లు కథనాలు వెలువడ్డాయి.

Harshvardhan Rane: బాలీవుడ్ లో ఎక్కువగా చిత్రాలు చేస్తున్నాడు తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణే. కాగా కొన్నాళ్లుగా ఈ యువ నటుడిపై ఓ రూమర్ నడుస్తుంది. నటి సంజీదా షేక్ తో ఆయన డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. ఈ రూమర్స్ ని సంజీదా గతంలో కొట్టిపారేశారు. హర్షవర్ధన్ నాకు స్నేహితుడు మాత్రమే, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వెల్లడించారు. తాజాగా ఈ వార్తలపై నటుడు హర్షవర్ధన్ రాణే స్పందించారు.
ఈ వార్తలు రాసే జర్నలిస్టుల మీద నాకేం కోపం లేదు. ఎందుకంటే వారికి టార్గెట్స్ ఉంటాయి. ప్రతివారం చేరుకోవాల్సిన లక్ష్యాలు ఉంటాయి. అందుకే వారు ఇలాంటి నిరాధార కథనాలు రాస్తుంటారని అన్నారు. పరోక్షంగా సంజీదాతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. సంజీదా-హర్షవర్ధన్ తైష్ మూవీలో కలిసి నటించారు. అప్పటి నుండి ఈ ఎఫైర్ రూమర్స్ భగ్గుమన్నాయి. గతంలో హర్షవర్ధన్ హీరోయిన్ కిమ్ శర్మతో ఎఫైర్ నడిపినట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇక రాజమండ్రిలో పుట్టిన హర్షవర్ధన్ తండ్రి మహారాష్ట్రకు చెందినవారు. తల్లి మాత్రం తెలుగువారు. హర్షవర్షన్ హిందీ, మరాఠి కూడా అనర్గళంగా మాట్లాడతారు. 2010లో తకిట తకిట మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. అనంతరం నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, అనామిక చిత్రాల్లో నటించారు.
కొన్నాళ్లుగా ఆయన బాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నారు. సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ తో బిజీ అయ్యారు. ప్రస్తుతం నాలుగు హిందీ చిత్రాల వరకు హర్షవర్ధన్ రాణే చేతిలో ఉన్నాయి. 2018లో విడుదలైన కవచం మూవీ తర్వాత తెలుగులో మూవీ చేయలేదు. త్వరలో బృందావనమది అందరిదీ అనే చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించనున్నాడు.