Youtuber Harsha : యూట్యూబ్ ను దున్నేసిన హర్ష.. ఇక సినిమాల్లోకి.. వివరాలు ఇవే..

ఇక హర్ష కుమార్ వీడియోస్ యూట్యూబ్ లో షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఛానెల్ కు 8.64 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్, ఇతర సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు.

  • Written By: SS
  • Published On:
Youtuber Harsha : యూట్యూబ్ ను దున్నేసిన హర్ష.. ఇక సినిమాల్లోకి.. వివరాలు ఇవే..

Youtuber Harsha : సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందరికీ అవకాశాలు రావు. వివిధ మార్గాల ద్వారా ఛాన్స్ కొట్టేస్తారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునేవారికి యూట్యూబ్ మంచి వేదికగా మారింది. ఇందులో వీడియోలు పెట్టి.. ఆ తరువాత వెండితెరపై కనిపించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కొందరు సొంత ఛానెళ్లతో ప్రేక్షకులను సంపాదించుకొని వారి అభిమానంతో టీవీ షోల కు కూడా వెళ్లారు. ఇలాగే ఓ యువకుడు యూట్యూబ్ చానెల్లో పలు వీడియోలు పోస్టు చేశాడు. అయితే ఆయన సినిమాల్లోకి రావాలని ఇవి పెట్టలేదు.  సమాజంలో పేదలు ఎలా ఉన్నారు? వారికి ఎలాంటి సాయం చేయాలి? అనే కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. వారి గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఈ క్రమంలో ఆయన సెలబ్రెటీ అయిపోయాడు. ఆయనే హర్షకుమార్.

హర్షకుమార్ పేరు సోషల్ మీడియా ట్రెండీగా మారింది. అందుకోసం ఆయన పడ్డ కష్టం మాములేం కాదు. కొండలు, కోనల్లో నివసించే పేదవారి కోసం వెళ్లేవాడు. అక్కడ వారి జీవనస్థితగతులను తెలుసుకొని బయటకు చెప్పేవారు. తనకు తోచిన సాయం చేస్తూ మిగతావారిని కూడా సాయం చేయాలని కోరేవాడు. ఇలా హర్షకుమార్ సమాజ సేవకుడిగా ఫేమస్ అయ్యారు. దీంతో కొందరు హర్షకుమార్ ద్వారా సాయం చేసిన వారూ ఉన్నారు. హర్షకుమార్ యూ ట్యూబ్ సెలబ్రెటీ కావడంతో ఆయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కొందరు అభిమానులు కోరారు.

ఈ నేపథ్యంలో ఆ మధ్య విశాఖకు పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు హర్షకుమార్ ను కలిశాడు. దీంతో హర్ష సినిమాల్లోకి రావడం ఖాయమే అన్నారు. కానీ అలా జరగలేదు. కానీ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. నటించడమే కాదు.. ఆ సినిమాను డైరెక్షన్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ తీస్తున్న కొత్త సినిమాలో హర్ష భాగం అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడుతారని సమాచారం.

ఇక హర్ష కుమార్ వీడియోస్ యూట్యూబ్ లో షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఛానెల్ కు 8.64 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్, ఇతర సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. ఈయన సమాజ సేవ చూసి కొందరు రాజకీయాల్లోకి వస్తారా? అని అడిగారు. కానీ హర్ష కుమార్ తనకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడు. మొత్తానికి ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టడంతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత వార్తలు