3 Lakhs For House: ఈ ఏడాది ఎన్నికల ఉన్న నేపథ్యంలో 2023_24 సంవత్సరానికి సంబంధించి అట్టడుగు వర్గాలను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పకడ్బందీ ప్లాన్ వేశారు.. డబుల్ బెడ్ రూమ్ పథకం ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో… ఈసారి ఏకంగా సొంత జాగా ఉంటే మూడు లక్షలు ఇస్తామని పేదలకు ఆఫర్ ఇచ్చారు. దీనికి బడ్జెట్లో 7,890 కోట్లు కేటాయించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా గేమ్ చేంజర్ అవుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Harish Rao
భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లో డబుల్ బెడ్ రూమ్ పథకానికి శ్రీకారం చుట్టింది.. దీనిని పైలెట్ ప్రాజెక్టుగా గజ్వేల్ లో మొదలుపెట్టింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా క్రమక్రమంగా విస్తరించుకుంటూ పోయింది.. అయితే సర్కారు ఆదాయం పంచుడు పథకాలకే సరిపోవడంతో ఈ డబుల్ బెడ్ రూమ్ పథకానికి ఆశించినంత మేర కేటాయింపులు జరగలేదు.. మరోవైపు ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు.. దీంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరలేదు.. దీనికి తోడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని చూస్తే కేంద్రం ఆంక్షలు విధించింది.. దీంతో పేదల్లో సర్కార్ పై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.

Harish Rao
ఈ క్రమంలో వారందరినీ ఆకట్టుకునేందుకు.. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు హరీష్ రావు మూడు లక్షల అస్త్రం ప్రయోగించారు.. ఇందులో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2000 మందికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కోటాలో 25 వేల మందికి మూడు లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. 2,63,000 మందికి 7, 890 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.