‘మెగా’ ఆఫర్ వదులుకున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఒక్క సినిమా అయినా మెగాస్టార్ చిరంజీవితో చేయాలని కలలు కంటుంటున్నారు. మెగాస్టార్ పిలుపు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. కొందరు డైరెక్టర్లకు ఆ అవకాశం వెంటనే వస్తే మరికొందరికీ చాలా ఏళ్లకు అవకాశం వస్తుంది. మరికొందరు డైరెక్టర్లు తమ కల నెరవేరకుండానే ఇండస్ట్రీని నుంచి తిరుగుముఖం పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు మెగాస్టార్ తో మూవీ చేసే అవకాశంచేసే అవకాశం వచ్చింది. అయితే […]

  • Written By: Neelambaram
  • Published On:
‘మెగా’ ఆఫర్ వదులుకున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఒక్క సినిమా అయినా మెగాస్టార్ చిరంజీవితో చేయాలని కలలు కంటుంటున్నారు. మెగాస్టార్ పిలుపు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. కొందరు డైరెక్టర్లకు ఆ అవకాశం వెంటనే వస్తే మరికొందరికీ చాలా ఏళ్లకు అవకాశం వస్తుంది. మరికొందరు డైరెక్టర్లు తమ కల నెరవేరకుండానే ఇండస్ట్రీని నుంచి తిరుగుముఖం పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు మెగాస్టార్ తో మూవీ చేసే అవకాశంచేసే అవకాశం వచ్చింది. అయితే ఈ డైరెక్టర్ తనకు దొరికిన బంపర్ ఆఫర్ ను వదలుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కించుకున్నాడు. ఈ మూవీని తన తండ్రితో నిర్మించాలని చరణ్ భావిస్తున్నాడు. ఈ మూవీ రీమేక్ బాధ్యతలను హరీష్ కు అప్పగిస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. ఈ మూవీ స్క్రీప్ట్ పనులు మొదలు పెడుతుండగానే హరీష్ శంకర్ కు పవన్ కల్యాణ్ మూవీ ఆఫర్ వచ్చింది. పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. మళ్లీ ఈ కాంబినేషన్ రిపిట్ కానుండటంతో హరీష్ శంకర్ మెగాస్టార్ ను వ్యక్తిగతంగా కలిసి పవన్ సినిమా గురించి చెప్పి రికెస్ట్ చేసినట్లు తెల్సింది. ఈ మూవీ తర్వాత మీతో చేయడానికి రెడీగా ఉంటానని చెప్పడంతో మెగాస్టార్ ఒకే అన్నారని ప్రచారం జరుగుతుంది.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీలో, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలోను నటిస్తున్నాడు. ఈ మూవీల తర్వాత హరీష్ తన ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ ఫస్టులుక్ నిన్నటి రిలీజై అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. హరీష్ మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకోవడంతో వీవీ వినాయక్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాతే ‘లూసీఫర్’ తెరకెక్కనుంది. అప్పటిగానీ డైరెక్టర్ విషయంలో ఒక క్లారిటీ రాదు- అందాక వేచి చూడాల్సిదే..

సంబంధిత వార్తలు