Variety Haldi Function: వీళ్ల దుంపతెగ.. బీరుతో పెళ్లి కొడుకుకు మంగళస్నానమేంట్రా.. వైరల్ వీడియో
తాజాగా నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ గ్రామంలో ఓ జంటకు పెళ్లి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుడికి మంగళ స్నానాలు చేయించడం ఆనవాయితీ.

Variety Haldi Function: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. అది ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో అర్థం కాదు. లోకంలో వెర్రి వేయి తలలు వేస్తుంది. ఈ నేపథ్యంలో వెర్రి వేషాలు వేయడం అందరికి అలవాటుగా మారింది. బైక్ మీద కూర్చుని స్నానం చేయడం, ద్విచక్ర వాహనం మీద వెళ్తూ ముద్దులు పెట్టుకోవడం వంటి చేష్టలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మరో విచిత్రమైన సంఘటన విస్తుగొలుపుతోంది. మనుషుల మెదళ్లు పరిపరి విధాలా ఆలోచిస్తాయని సూచిస్తోంది.
తాజాగా నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ గ్రామంలో ఓ జంటకు పెళ్లి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుడికి మంగళ స్నానాలు చేయించడం ఆనవాయితీ. అవి పసుపుతో చేయిస్తారు. పసుపు నీళ్లు కలిపి మంగళస్నానాలు చేయించడం ఆచారం. కానీ ఇక్కడ వరుడికి మంగళస్నానాలు బీరుతో చేయించడం సంచలనంగా మారింది. ఎవరైనా బీరును తాగుతారు కానీ స్నానం చేస్తారా?
వారు చేసిన తతంగం అందరిలో ఆశ్చర్యాన్ని నింపుతోంది. పసుపు నీళ్లతో స్నానం చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ బీరుతో స్నానం చేస్తే అంతా బీరు వాసన వస్తుంది. ఇలా చేయడం వెనుక వారి ఆంతర్యమేమిటి? ఉద్దేశం ఏమిటనేది తెలియడం లేదు. ఇలా బీరుతో స్నానం చేసిన పెళ్లికొడుకు బహుశా ఇతడేనేమో. మొత్తానికి వారి వింత ఆలోచన అందరిలో ఆగ్రహం తెప్పిస్తోంది.
వివాహం అంటే పవిత్రమైన కార్యంగా చెబుతారు. అలాంటి కార్యంలో బీరును తీసుకురావడం గందరగోళానికి దారి తీసింది. వరుడు బీరు వాసన వస్తే పెళ్లి ఎలా చేస్తారు? ఏదైనా ఆలోచిస్తే మంచికి మార్గంగా ఉండాలి కానీ ఇలా విచిత్రమైన విధంగా ఆలోచించడం వివాదాలకే స్థానంగా మిగులుతోంది. ఇలాంటి ఆచారాలను కాదని కొత్తగా చేస్తూ అందరిలో నవ్వుల పాలు కావడం దేనికో అర్థం కావడం లేదు.