Pawan Heroine : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

ఇంతకుముందు ఈ హీరోయిన్ కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసారా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా సంయుక్త నిఖిల్‌ స్వయంభూ సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైందని తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

  • Written By: Vishnupriya
  • Published On:
Pawan Heroine : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

Pawan Heroine : కొంతమంది చిన్నప్పుడు లాగానే పెద్దయ్యాక కూడా ఉంటారు. మరి కొంతమంది పెద్దయ్యేకొద్దీ చాలా మారిపోతూ ఉంటారు. మరి పై ఫోటోలో చందమామ లాగా ఎంతో చక్కగా కనిపిస్తున్న చిన్న అమ్మాయి ఇప్పుడు పెద్దయ్యాక ఎవరో గుర్తుపట్టగలరా? ప్రస్తుతం ఆమె తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో లో నటించిన హీరోయిన్.

Samyuktha menon

Samyuktha menon

పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ సొంతం చేసుకుంది. అందంతోనే కాదు తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ హీరోయిన్ తెలుగులో చేసిన ఏ సినిమా కూడా ప్రస్తుతం వరకు ఫ్లాప్ కాలేదు. ఇక అలాంటి హీరోయిన్ కి వరుసగా ఆఫర్లు వస్తాయి అనుకున్నారు అందరూ. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో అన్ని ఆఫర్లు అయితే లేవు. ప్రస్తుతం ఆమె చేతుల్లో ఉండేది ఒకే ఒక్క తెలుగు సినిమా.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

ఇక ఇప్పటికైనా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోతే నీకోసం ఈమె గురించి మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి…

పరిచయమైంది పవన్ కళ్యాణ్ సినిమా ద్వారానే అయినా.. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా కాకుండా మరో హీరో రానాకి జోడిగా నటించింది. ఇక తరువాత కళ్యాణ్ రామ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అలానే ధనుష్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోయిన్ ఈ మధ్య వచ్చిన మెగా మేనల్లుడు సాయ ధరమ్‌ తేజ్‌ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్ సొంతం చేసుకుంది.

ఇక ఈ వివరాలతో తప్పకుండా ఈ బ్యూటీ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు అనుకునింది కరెక్టే ఈమె ఎవరో కాదు.. మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. ఈమధ్య సెప్టెంబర్ 11వ తేదీన ఈమె పుట్టినరోజు జరుపుకుంది. అందుకే తన చిన్ననాటి అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఆ పోస్టుల కింద ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి అని క్యాప్షన్లు పెడుతున్నారు.

మరోపక్క ఈమె పుట్టినరోజు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు విషెస్‌ తెలియజేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సాయి ధరమ్‌ తేజ్‌ విరూపాక్ష సినిమాలో చివరిగా కనిపించింది సంయుక్త ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతకుముందు ఈ హీరోయిన్ కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసారా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా సంయుక్త నిఖిల్‌ స్వయంభూ సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైందని తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు