సప్తగిరి హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా కె.ఎం.కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “గూడుపుఠాణి”. ఎస్.ఆర్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి, రమేశ్ యాదవ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

Guduputani Telugu Movie Review
కథ :
గిరి (సప్తగిరి) సిరి (నేహా సోలంకి) ఇద్దరూ ప్రేమించుకుంటారు. అడవిలో ఉన్న ఓ పురాతన దేవాలయంలో ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వెళ్తారు. అయితే, గుడిలో నగలు దొంగిలిస్తూ కనిపించిన అమ్మాయిలను రేప్ చేసే ఓ ముఠా కూడా ఆ గుడికి నగలు దొంగిలించడానికి వస్తోంది. ఒక పక్క గిరి మహా భయస్థుడు. చిన్న చిన్న వాటికే భయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ ముఠా చేతికి ‘సిరి’ దొరికిపోతుంది. మరి మహా భయస్థుడు అయినా ‘గిరి’ ఆ ముఠా నుంచి తన ‘సిరి’ని ఎలా కాపాడుకున్నాడు ? చివరకు అసలు ఈ సిరి, గిరి ఎవరు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన సప్తగిరి తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించాడు. అలాగే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన నేహా సోలంకి నటన కూడా బాగుంది. ఆమె తన అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఆమె నటన బాగుంది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
పాయింట్ పరంగా, కామెడీ పరంగా మంచి కంటెంట్ తీసుకునే అవకాశం ఉన్నా దర్శకుడు మాత్రం స్క్రిప్ట్ ను పర్ఫెక్ట్ గా రాసుకోవడంలో సంపూర్ణంగా ఫెయిల్ అయ్యాడు. సినిమాలో కీలక సన్నివేశాలను, అలాగే ట్రీట్మెంట్ ను ఇంకా బెటర్ రాసుకుని ఉండి ఉంటే సినిమా బాగా వచ్చేది. సినిమాలో కామెడీ బాగానే చొప్పించారు గానీ, ప్రేక్షకులను మాత్రం పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయారు.
Also Read: Shyam Singha Roy Telugu Movie Review: శ్యామ్ సింగరాయ్ మూవీ రివ్యూ
అనవసరమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు. దీనికి తోడు కథ పరంగా సింగిల్ లొకేషన్ (గుడి)లోనే సినిమాని నడపాల్సి రావడం.. ప్రేక్షకులకు కొన్ని సీన్స్ విషయంలో మోనాటనీ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అన్నీ ఆకట్టుకోవు. దానికి తోడు సెకండాఫ్ కూడా వర్కౌట్ కాలేదు. ఒక్క సప్తగిరి మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు.
* సాంకేతిక నిపుణుల పనితీరు :
దర్శకుడు కుమార్.కె.ఎం మంచి పాయింట్ ను అనుకున్నాడు.అందుకు తగ్గట్టే మంచి క్యాస్టింగ్ ను కూడా ఎంపిక చేసుకున్నాడు.నిర్మాతతో అతను అనవసరపు ఖర్చు చేయించలేదు.ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవచ్చు.అలాగే హీరో,విలన్ పాత్రలను అతను తీర్చిదిద్దిన తీరు కూడా బాగుంది.కాకపోతే క్లైమాక్స్ పై అతను ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
మెయిన్ పాయింట్, ఎమోషనల్ సన్నివేశాలు,
కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ స్లోగా సాగడం,
సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,
బోరింగ్ ప్లే.
సినిమా చూడాలా ? వద్దా ? :
ఈ “గూడుపుఠాణి“లో సప్తగిరి నటన, నేహా సోలంకి గ్లామర్ తప్ప ఇక ఆకట్టుకునే అంశాలు ఏమి లేవు. కాకపోతే సినిమాలో సప్తగిరి తన కామెడీ టైమింగ్ తో కొన్ని చోట్ల నవ్వించాడు. ఈ క్రమంలో కొన్ని హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఐతే స్లో నేరేషన్, సింపుల్ ప్లే, సింగిల్ ప్లాట్, స్క్రిప్ట్ లో లోపాలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.
Guduputani Telugu Movie Review: రేటింగ్ : 2.75
Also Read: Pushpa Telugu Movie Review: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ