GT Vs MI Qualifier 2: ఐపీఎల్ లో కీలక సెమీస్ : ముంబై బ్యాటింగ్ vs గుజరాత్ బౌలర్స్.. గెలుపెవరిదో..?

ఐపీఎల్ 16వ ఎడిషన్ లో అత్యంత కీలకమైన పోరు సెమీస్ శుక్రవారం జరగనుంది. ముంబై – ఇండియన్స్ గుజరాత్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. వరుస మ్యాచ్ ల్లో విజయాలతో ముంబై దూకుడు మీద ఉండగా

  • Written By: BS Naidu
  • Published On:
GT Vs MI Qualifier 2: ఐపీఎల్ లో కీలక సెమీస్ : ముంబై బ్యాటింగ్ vs గుజరాత్ బౌలర్స్.. గెలుపెవరిదో..?

GT Vs MI Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ కీలక దశకు చేరుకుంది. శుక్రవారం క్వాలిఫైయర్-2 మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఈ సెమీస్ పోరు జరగనుంది. ముంబై జట్టు విజయ ఉత్సాహంతో ముందుకు వెళుతుండగా గుజరాత్ టైటాన్స్ మాత్రం ఒత్తిడితో ఈ పోరుకు సిద్ధమవుతోంది.

ఐపీఎల్ 16వ ఎడిషన్ లో అత్యంత కీలకమైన పోరు సెమీస్ శుక్రవారం జరగనుంది. ముంబై – ఇండియన్స్ గుజరాత్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. వరుస మ్యాచ్ ల్లో విజయాలతో ముంబై దూకుడు మీద ఉండగా, ప్లే ఆఫ్ దశలో ఓటమితో గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇరు జట్లు బలమైనవి కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు జట్లలో మంచి హిట్టింగ్ చేసే ఆటగాళ్లు ఉండడంతో భారీ స్కోరు నమోదవుతుందని భావిస్తున్నారు.

విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్..

ఈ సీజన్ తొలి, మధ్యలో కొంత ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ చివరికి వచ్చేసరికి టాప్ గేర్ లో ముందుకు దూసుకుపోతోంది. చివరి ఐదు గేమ్ ల్లో నాలుగు విజయాలు సాధించి ఒకే ఒక్క ఓటమితో సెమీస్ వరకు వచ్చింది ఈ జట్టు. బ్యాటింగ్ విభాగంలో అత్యంత బలంగా ఈ జట్టు కనిపిస్తోంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, టీమ్ డేవిడ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు ఫామ్ లో ఉండడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న ముంబై జట్టును గుజరాత్ టైటాన్స్ ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే రోహిత్ శర్మ టచ్ లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఇషాన్ కిషన్ తనదైన రోజున ఎంతటి విధ్వంసం సృష్టించగలడో అందరికీ తెలిసిందే. ఇక, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్ సృష్టించే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో కూడా అంచనా వేయలేం. అందరూ మంచి ఫామ్ లో ఉండడంతో ముంబై ఇండియన్స్ కు కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో కొత్తగా జట్టులో చేరిన ఆకాశ మద్వాల్ జట్టుకు అదనపు బలం. ఇక పీయూష్ చావ్లా, బెహ్రాన్డార్ఫ్ జట్టుకు కీలకంగా వ్యవహరించనున్నారు.

బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న గుజరాత్ టైటాన్స్..

ఇక ఈ సీజన్ లోనే అద్భుతమైన బౌలింగ్ చేస్తున్న గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఈ మ్యాచ్ లో కీలకంగా మారనున్నారు. బ్యాటింగ్ విభాగంలోనూ బలంగానే ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో ఈ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ వంటి బౌలర్లతో అరవీర భయంకరంగా కనిపిస్తోంది ఫేస్ దళం. అవసరం అనుకుంటే విజయ శంకర్, హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయగలరు. ఇక బ్యాటింగ్ లో భాగంలో చూసుకుంటే ఈ సీజన్ లోనే అద్భుతంగా రాణిస్తున్నాడు గిల్. బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. ఈ మ్యాచ్ లోను చెలరేగితే గుజరాత్ జట్టుకు తిరిగే ఉండదని ఆ జట్టు యాజమాన్యంతోపాటు సహచరులు భావిస్తున్నారు. ఇక, వృద్ధిమాన్ సాహ, హార్దిక్ పాండ్యా, విజయ శంకర్, మిల్లర్, రాహుల్ తివాటియాతో కూడిన బ్యాటింగ్ విభాగం కూడా బలంగానే కనిపిస్తోంది. వీరంతా టచ్ లోనే ఉండడంతో జట్టు విశ్వాసంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని విశ్లేషిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు చేజింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా విజయ్ శంకర్ తో వెళ్లే అవకాశం ఉంది. డిఫెండింగ్ లో ఉంటే ఫాస్ట్ బౌలర్ ను తీసుకునే అవకాశముంది.

ఫేస్.. బౌన్స్ ఉండే అవకాశం..

అహ్మదాబాద్ మైదానంలో ఈ రోజు వాతావరణం 43 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పిచ్ లో బౌన్స్ ఉంటుందని, ఫేస్ బౌలర్లకు కొంత అనుకూలంగా ఉండవచ్చని పిచ్ క్యూరేటర్ చెబుతున్నారు.

ఇవి జట్లు అంచనా..

ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టన్), కామెరాన్ గ్రీన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హృతిక్ సోకిన్/నేహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయాష్ చావ్లా, జాషన్ బెహ్రాన్ డార్ఫ్, ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ.

గుజరాత్ టైటాన్స్ జట్లు అంచనా..

సుబ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టన్), విజయ శంకర్, డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్/అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, జోష్ లిటిల్ / యష్ దయాల్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ.

సంబంధిత వార్తలు