TCA Bathukamma: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

TCA Bathukamma: సప్త సముద్రాలు దాటినా మన ఆచారాలు, సంప్రదాయాలు మారవు. ఎక్కడున్నా తెలంగాణ వారి పండుగలంటే విశిష్టత ఉండటం వాస్తవమే. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకునే క్రమంలో మన వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టించుకోరు. ఎల్లలు దాటినా మన కల్చర్ ను మాత్రం మర్చిపోరు. దీంతో తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పండుగల్లో బతుకమ్మ ముందుంటుంది. ఆడపడుచుల ముద్దుల పండుగగా గుర్తింపు తెచ్చుకున్న బతుకమ్మ పండుగ దేశాలుదాటినా వారిలో ఆచారం మాత్రం తగ్గలేదు. దీంతో వారు […]

  • Written By: Naresh
  • Published On:
TCA Bathukamma: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

TCA Bathukamma: సప్త సముద్రాలు దాటినా మన ఆచారాలు, సంప్రదాయాలు మారవు. ఎక్కడున్నా తెలంగాణ వారి పండుగలంటే విశిష్టత ఉండటం వాస్తవమే. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకునే క్రమంలో మన వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టించుకోరు. ఎల్లలు దాటినా మన కల్చర్ ను మాత్రం మర్చిపోరు. దీంతో తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పండుగల్లో బతుకమ్మ ముందుంటుంది. ఆడపడుచుల ముద్దుల పండుగగా గుర్తింపు తెచ్చుకున్న బతుకమ్మ పండుగ దేశాలుదాటినా వారిలో ఆచారం మాత్రం తగ్గలేదు. దీంతో వారు ఖండాంతరాలు దాటినా మనలో ఇమిడి ఉన్న ఆశలు మాత్రం ఎప్పుడు కూడా వెనకకు రావు. వాటిని తీర్చుకునే క్రమంలో మనం ఎక్కడున్నా వాటికి జై కొట్టాల్సిందే.

కెనడా దేశంలోని టోరంటో నగరంలో మన తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దాదాపు ఆరు గంటల పాటు బతుకమ్మ పాటలు పాడుతూ చిందులు వేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ వారిలో ఉన్న మన పండుగ విశిష్టతను పాటల రూపంలో తెలియజేశారు. దీంతో అక్కడ స్థిరపడిన అందరు బతుకమ్మ వేడుకలను తిలకించేందుకు రావడం సంచలనం కలిగించింది. దేశం కాని దేశం అయినా వారిలో ఐక్యత చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది.

సద్దుల బతుకమ్మ నిర్వహించి మన సంస్కృతిని ఎలుగెత్తి చాటారు. సంప్రదాయ దుస్తుల్లో అందరు అలరించారు. పాటలతో హోరెత్తించారు. ఆడి పాడి సందడి చేశారు. మహిళలంతా బతుకమ్మ పాటలు పాడుతూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసులంతా ఒక చోట చేరడంతో అందరిలో హర్షం వ్యక్తమైంది. ఒకరికి ఒకరు తోడుగా అన్నట్లు అక్కడ మన పండుగ ఆచారాన్ని వారికి చూపించి వారిలో కూడా ఆశ్చర్యం నింపారు. తెలంగాణ పండుగ అంటే ఇంతటి విశిష్టత ఉంటుందా అని వారికి అర్థమయ్యేలా చేశారు.

కెనడాలో ఉన్న తెలంగాణ వాసులందరు ఒకే చోట చేరి బతుకమ్మ ఆడి పాడటం అందరిని సంతోషానికి గురిచేసింది. బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి, ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు, చిత్తలూరి దేవేందర్ రెడ్డి గుజ్జుల , ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి, శ్రీనాథ్ కుందూరి తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కెనడా దేశంలో తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేశారు. బతుకమ్మ సంబరాలకు విశ్వ విఖ్యాతి తీసుకొచ్చారు. మన ఆచార, వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనంగా బతుకమ్మ వేడుకలు నిలవడం గమనార్హం.