ఉభయ రాష్ర్టాల్లో ఉద్యోగుల ప్రయోజనాలు పట్టవా?

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నోరెత్తాలంటే భయం కలుగుతోంది. ఒకవేళ మాట్లాడితే ఏమవుతుందోనని మాట్లాడటానికి వెనుకంజ వేస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం నోరెత్తే చాన్స్ లేదు. ఓ వైపు పొరుగు రాష్ర్ట ఉద్యోగులు 30 శాతం పీఆర్సీ పొందారు. ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు పెంచింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పీఆర్సీ గురించి నోరు విప్పడం లేదు. జీతాలు సైతం సమయానికి ఇస్తారో లేదో అనే టెన్షన్ పట్టుకుంది. మొదటి దశ సమయంలో రెండు నెలల పాటు […]

  • Written By: Raghava
  • Published On:
ఉభయ రాష్ర్టాల్లో ఉద్యోగుల ప్రయోజనాలు పట్టవా?

Telugu statesఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నోరెత్తాలంటే భయం కలుగుతోంది. ఒకవేళ మాట్లాడితే ఏమవుతుందోనని మాట్లాడటానికి వెనుకంజ వేస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం నోరెత్తే చాన్స్ లేదు. ఓ వైపు పొరుగు రాష్ర్ట ఉద్యోగులు 30 శాతం పీఆర్సీ పొందారు. ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు పెంచింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పీఆర్సీ గురించి నోరు విప్పడం లేదు.

జీతాలు సైతం సమయానికి ఇస్తారో లేదో అనే టెన్షన్ పట్టుకుంది. మొదటి దశ సమయంలో రెండు నెలల పాటు కత్తిరించిన సగం జీతం వరకు మళ్లీ ఇవ్వలేదని తెలుస్తోంది. 2014లో రాష్ర్టం ఏర్పడిన కొత్తలో కొత్త రాష్ర్టం సాధించుకున్న ఉత్సాహంలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టం ధనిక రాష్ర్టం కావడంతోనే ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించారని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మాత్రం ఉద్యోగులు నిరాశపడకూడదని 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. మళ్లీ ఐదేళ్లకు ముందు ఎన్నికల సమయంలో ఇరవై శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రకటించిన ఐఆర్ ను కాస్త పెంచారు. కానీ పీఆర్సీ గురించి మరిచిపోయారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా మాట్లాడేవి. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎక్కువగా మాట్లాడేవారు.

ప్రభుత్వం నుంచి వారికి వేధింపులు ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఉద్యోగుల ప్రయోజనాల గురించి మాట్లాడేవారు లేరు. ప్రభుత్వ ప్రయోజనాల గురించి మాట్లాడటమే సామాజిక బాధ్యత అనుకునే వారు పెరిగిపోయారు. సీపీఎస్ రద్దు కోసం అప్పట్లో ఉద్యమాలు చేసేవారు. ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకున్న సీఎం జగన్ వారంలో సీపీఎం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగ సంఘాలు నోరెత్తడం లేదు. తెలంగాణలో ఉద్యోగ సంఘాలకు కేసీఆర్ ఎంతో కొంత మేలు చేస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగ సంఘాలను రాజకీయంగా వాడుకుంటున్నా కనీసమేలు చేయడం లేదన్నఅసంతృప్తి ఉద్యోగుల్లో కనిపిస్తోంది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు