KCR: కెసిఆర్ కు మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్
అయితే గతంలో కౌశిక్ రెడ్డికి విషయంలో కూడా గవర్నర్ ఇదే తీరుగా వ్యవహరించారు. కౌశిక్ రెడ్డి ఉదంతం నుంచే అటు రాజ్ భవన్, ఇటు ప్రగతి భవన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.

KCR: ప్రగతిభవన్ కు, రాజ్ భవన్ కు అంతరాలు తగ్గిపోయాయి. రెండు పాలనా వేదికలు కలిసిపోయాయి. వివాదాలు సమసిపోయి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఒకటయ్యారని అందరూ అనుకున్నారు. మొన్న రాష్ట్రపతి తెలంగాణకు వచ్చినప్పుడు కెసిఆర్ గవర్నర్ తో మాట్లాడటం, తెలంగాణ పాలనా సౌధాన్ని చూపించడానికి ఆమెను తీసుకెళ్లడం, మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్ భవన్ వెళ్లడం.. ఇవన్నీ పరిణామాలతో ఇక ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అని చాలామంది భావించారు. అయితే వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ గవర్నర్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుగులేని షాక్ ఇచ్చారు
కెసిఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి అర్హతలు అడ్డువస్తున్నాయని ప్రభుత్వానికి ఆమె లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. అభ్యర్థులు ఇద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్టు కనిపించలేదంటూ గవర్నర్ ప్రత్యేక లేక ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్యే రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ పేర్కొన్నారు.
అయితే గతంలో కౌశిక్ రెడ్డికి విషయంలో కూడా గవర్నర్ ఇదే తీరుగా వ్యవహరించారు. కౌశిక్ రెడ్డి ఉదంతం నుంచే అటు రాజ్ భవన్, ఇటు ప్రగతి భవన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా కౌశిక్ రెడ్డి ఎక్కడా కార్యక్రమాలు చేసినట్టు కనిపించలేదని గవర్నర్ తిరస్కరించారు. దీంతో భారత రాష్ట్ర సమితి శ్రేణులు నేరుగానే గవర్నర్ పై విమర్శలు చేశాయి. గవర్నర్ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. అయినప్పటికీ గవర్నర్ తన నిర్ణయం నుంచి వెనక్కి తిరిగి రాలేదు. తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు కూడా కౌశిక్ రెడ్డి లాంటి అనుభవమే ఎదురయింది.
ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాజ్ భవన్ వచ్చారు. ఆ సమయంలో తమిళి సైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం అక్కడ నూతన సచివాలయాన్ని సందర్శించారు. అక్కడే నిర్మించిన చర్చి, గుడి, మసీదులను ప్రారంభించారు. అనంతరం అనేక సమావేశాలకు కూడా సీఎం కేసీఆర్ను గవర్నర్ పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో రెండు పాలనా వ్యవస్థల మధ్య అగాధం తొలగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతేకాకుండా ఇటీవల ఆర్టీసీ విలీనం బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. ఇంతలోనే ప్రభుత్వం సిఫారసు చేసి పంపించిన గవర్నర్ కూడా అభ్యర్థులను ఆమె తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి నాయకులు షాక్ కు గురయ్యారు. మరి దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
