Google Pixel 7A: 50వేలలోపే గూగుల్ పిక్సెస్ 7ఏ.. కేబుల్ లేకుండానే ఛార్జింగ్.. అదిరిపోయిన ఫీచర్లు
గూగుల్ కంపెనీ భారత్ వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. Google Pixel 7a మిగతా దేశాల్లోకంటే తక్కువ ధరకే విక్రయించాలని నిర్ణయించింది. ఈ స్టార్ట్ ఫోన్ ధర వివిధ ఆఫర్లతో కలిసి 40,000కే దక్కించుకోవచ్చు.

Google Pixel 7A: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ స్మార్ట్ మొబైల్ రంగంలోకి ఎప్పుడో అడుగుపెట్టింది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఫోన్లను వినియోగదారులకు అందించింది. లేటేస్టుగా Google Pixel 7aను అందుబాటులోకి తీసుకొచ్చింది. Google Pixel 6aకు కొనసాగింపుగా దీనిని మార్కెట్లోకి మే 11న రిలీజ్ చేసింది. భవిష్యత్ అంతా 5 జీ మయం కావడంతో Google Pixel 7a 5జీ తోనే లాంఛ్ అయింది. అయితే మిగతా దేశాల్లో కంటే భారత్ లో తక్కువ ధరకే అందిస్తుంది. ఆన్లైన్లో ఫ్లిప్ కార్డ్ లో ఈ మోడల్ అందుబాటులో ఉండడంతో ఇప్పటికే వినియోగదారులు దీనిని బుక్ చేసుకున్నారు. తొలిసారిగా కేబల్ లేకుండా చార్జింగ్ అయ్యే మోడల్ గా Google Pixel 7a రికార్డు నమోదు చేసింది. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా.
గూగుల్ కంపెనీ భారత్ వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. Google Pixel 7a మిగతా దేశాల్లోకంటే తక్కువ ధరకే విక్రయించాలని నిర్ణయించింది. ఈ స్టార్ట్ ఫోన్ ధర వివిధ ఆఫర్లతో కలిసి 40,000కే దక్కించుకోవచ్చు. వేరే దేశాల్లో మాత్రం రూ.50వేలకు పైగానే ఉంది. భారత్ లో దీని అసలు ధర రూ.43,999 ఉండగా HDFC బ్యాంక్ హోల్డర్లు రూ.4 వేలు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఏదైనా పిక్సెల్ డివైజ్ లేదా కొన్ని స్మార్ట్ ఫోన్ల్ కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ రూ.4 వేల డిస్కౌంట్ పొందవచ్చు.
Google Pixel 7a ఫీచర్స్ విషయారనికొస్తే 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్ డి +OLED డిస్ ప్లే తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, హెచ్ డి సపోర్ట్ తో పాటు ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ మొబైల్ లో లేటేస్టుగా జీ2 ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండడంతో పాటు 5జీ నెట్ వర్క్ ను సపోర్టు చేస్తుంది. అలాగే 13 ఓఎస్ ఆండ్రాయిడ్ ఉంటుంది.
18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తున్న Google Pixel 7a తొలిసారి వైర్ లెస్ చార్జింగ్ అయ్యే ఫోన్ గా రికార్డు సృష్టించనుంది. 4,385 mAh బ్యాటరీ ఉన్న ఈ మోడల్ బరువు 193 గ్రాములు ఉంటుంది. ఇప్పటికే దీనిని ఫ్లిప్ కార్డులో సొంతం చేసుకునేందుకు బుక్ చేసుకున్నారు. Google Pixel 6aకు కొనసాగింపుగా వచ్చిన దీనిని సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
