TS Group 4 Jobs: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య జఠిలంగా మారుతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో ఎదురుచూస్తున్న వారి కోరికలు నెరవేరే సందర్భం రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉద్యోగాల కోసం పరితపిస్తున్న యువత తమ కలలు నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు.

TS Group 4 Jobs
రాష్ర్టంలో 9168 గ్రూప్ 4 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించింది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయం తేల్చింది. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీలను ప్రకటించింది. జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు 429 ఉన్నాయి. ఆర్థిక శాఖలో 191, మున్సిపల్ శాఖలో 238, జూనియర్ అసిస్టెంట్ 6859 మిగిలాయి. రెవెన్యూ శాఖలో 2077, పంచాయతీ రాజ్ శాఖలో 1245, మున్సిపల్ లో 601, బీసీ సంక్షేమ శాఖలో 307, ఆరోగ్య శాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742 ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
హోం శాఖలో 133, గిరిజన సంక్షేమ శాఖలో 221, సెకండరీ విద్యాశాఖలో 97, ఎస్సీ అభివృద్ధి శాఖలో 474, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18, వార్డు ఆఫీసర్ ఉద్యోగాలు 1862 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. దీంతో పోస్టులు దక్కించుకునేందుకు అభ్యర్థులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు అందించినట్లు అయింది. తమ తెలివితేటలతో ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని భావిస్తున్నారు.

TS Group 4 Jobs
తెలంగాణ ప్రభుత్వం ఇన్నేళ్లకు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవడంతో ఆశావహులు తమ చిరకాల వాంఛ తీర్చుకోవాలని చూస్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో ఎలాగైనా విజయం సాధించి జాబ్ దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తమ బుర్రలకు పని చెబుతున్నారు. దీంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కూడా రెడీ అవుతోంది.