Maxwell Wife Vini Raman: మాక్స్ వెల్ భార్యకు సీమంతం.. అభిమానులు ఫిదా

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, ఐపీఎల్ లో బెంగళూరు జట్టు కీలక ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ భార్య గర్భం దాల్చింది. మ్యాక్స్ వెల్ భార్య వినీ రామన్ కు ఈ మధ్య ఏడు నెలలు నిండాయి. దీంతో మ్యాక్స్ వెల్ తన భార్యకు దక్షిణ భారతదేశంలో నిర్వహించే సాంప్రదాయ సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించాడు. అచ్చమైన చీరకట్టు, బొట్టులో వినీ రామన్ ను మహాలక్ష్మిలా ముస్తాబు చేసి ఈ వేడుకను నిర్వహించారు.

  • Written By: BS
  • Published On:
Maxwell Wife Vini Raman: మాక్స్ వెల్ భార్యకు సీమంతం.. అభిమానులు ఫిదా

Maxwell Wife Vini Raman: ప్రపంచ దేశాలు భారతీయ సనాతన ధర్మం, సనాతన ధర్మంలోని పద్ధతులను అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు హిందూ ధర్మంలోని గొప్పతనాన్ని గుర్తించి వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రాశ్చత్య మోజులో పడి హిందూ ధర్మ పద్ధతులను విడనాడుతున్నారు. అటువంటి వారికి కనువిప్పు కలిగించేలా ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆటగాడు తన భార్యకు హిందూ ధర్మ పద్ధతుల్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. గ్లెన్ మాక్స్ వెల్ తన భార్యకు నిర్వహించిన ఆ వేడుక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, ఐపీఎల్ లో బెంగళూరు జట్టు కీలక ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ భార్య గర్భం దాల్చింది. మ్యాక్స్ వెల్ భార్య వినీ రామన్ కు ఈ మధ్య ఏడు నెలలు నిండాయి. దీంతో మ్యాక్స్ వెల్ తన భార్యకు దక్షిణ భారతదేశంలో నిర్వహించే సాంప్రదాయ సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించాడు. అచ్చమైన చీరకట్టు, బొట్టులో వినీ రామన్ ను మహాలక్ష్మిలా ముస్తాబు చేసి ఈ వేడుకను నిర్వహించారు.

ఈ సీమంతం ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన వినీ రామన్.. ‘ బేబీ మ్యాక్స్ వెల్ కు మా సాంప్రదాయ పద్ధతిలో ఆశీర్వాదం’ అని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే విని తమిళనాడు రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఈ క్రమంలోనే మ్యాక్స్ వెల్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వీరిద్దరూ 2019లో ఆస్ట్రేలియా నిర్వహించిన క్రికెట్ అవార్డులు వేడుకకు హాజరయ్యారు. అప్పుడే వీరి ప్రేమ వ్యవహారం ప్రపంచానికి తెలిసింది. గత ఏడాది మార్చిలో వీరి వివాహం జరిగింది.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube