Gaalodu Closing Collections: ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న నటుడు సుడిగాలి సుధీర్..వ్యక్తిగత జీవితం లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని జబర్దస్త్ షో లో అవకాశం పొంది తన కామెడీ టైమింగ్ తో అశేష ప్రజాభిమానం పొందాడు..అయితే బుల్లితెర పాపులారిటీ వెండితెరకి పనికిరాదు, హీరో గా చేసి కెరీర్ ని నాశనం చేసుకోవద్దు అంటూ సుధీర్ కి చాలామంది సలహాలు ఇచ్చారు..కానీ సుధీర్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ హీరో గా కూడా మొట్టమొదటి సక్సెస్ ని అందుకున్నాడు..అది కూడా ఫ్లాప్ టాక్ తో.రీసెంట్ గా విడుదలైన ‘గాలోడు’ చిత్రానికి పబ్లిక్ టాక్ అసలు బాగోలేకపోయిన కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది..ఓపెనింగ్స్ నుండే ఈ సినిమా ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ వచ్చింది..ఇక వీక్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ రాబడుతూ ముందుకు దూసుకుపోయిన ఈ చిత్రం కలెక్షన్స్ ఇప్పుడు క్లోసింగ్ కి వచ్చేసింది.

sudigali sudheer
ఈ సినిమాకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో దుమ్ములేచిపొయ్యే కలెక్షన్స్ వచ్చాయి..అక్కడ ఈ చిత్రానికి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ రావడం విశేషం..ఇక నైజాం ప్రాంతం లో కూడా ఈ సినిమాకి దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..నైజాం ప్రాంతం లో టాక్ బాగోలేకపోతే పెద్ద హీరోల సినిమాలు సైతం వీక్ డేస్ లో కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయి..కానీ మొదటి రోజు నుండి ఇక్కడ గాలోడు మూవీ పెర్ఫార్మన్స్ అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి.

sudigali sudheer
ఆంధ్ర ప్రాంతం లో నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ మరియు 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది..ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 2 కోట్ల 50 లక్షల రూపాయలకు జరగగా, ఫుల్ రన్ లో రెండు కోట్ల రూపాయలకు పైగా లాభాలను రాబట్టింది అన్నమాట..ఈ రేంజ్ సక్సెస్ ని బహుశా మూవీ టీం లో ఎవ్వరూ ఊహించి ఉండరు.